Home » 2021 లో ట్రాఫిక్ చ‌ల‌నాలతో ఎంత ఆదాయం వ‌చ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

2021 లో ట్రాఫిక్ చ‌ల‌నాలతో ఎంత ఆదాయం వ‌చ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by Bunty
Ad

మ‌నం రోడ్డు పైకి వాహ‌నం తీసుకునే వేళ్తే.. ఎక్క‌డ పోలీసులు ఉన్నార‌నే భ‌యంతో ఉంటాం. పోలీసులు ఎక్క‌డ ఫోటో లు కొడుతారో.. ఎక్క‌డ చ‌ల‌నా పడుతుందో అనే టెన్ష‌న్ ప్ర‌తి ఒక్క‌రిలో ఉంటుంది. వారి కెమెరా కంట క‌న‌బ‌డ‌కుంటా.. జాగ్ర‌త్త గా వెళ్తుంటాం. ఎన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. కొన్ని సార్లు ట్రాఫిక్ చల‌నా ప‌డుతుంది. అయితే 2021 ఏడాది ముగుస్తుండ‌టంతో ఈ ఏడాది తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ చల‌నాల ద్వారా స‌ర్కార్ కు ఎంత ఆదాయం వ‌చ్చిందో తెలిస్తే మ‌నం త‌ప్ప కుండా షాక్ అవుతాం. ఒక ఏడాదిలో స‌మాన్య జ‌నాల నుంచి ట్రాఫిక్ రూల్స్ తో ఏకంగా రూ. 533 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ‌చ్చింది.

Advertisement

Advertisement

అంటే ఒక రోజుకు రూ. 1.50 కోట్ల చొప్పున మ‌న నుంచి తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌చ్చింది. ఈ రూ. 533 కోట్ల‌ల్లో అత్య‌ధికంగా హెల్మెట్ లేకుండా ద్విచ‌క్ర‌వాహ‌నాలు న‌డిపినందుకు 37.33 శాతం జ‌రిమానా ప‌డింది. దీని త‌ర్వాత స్థానం ఓవ‌ర్ స్పీడ్. ఓవ‌ర్ స్పీడ్ వ‌ల్ల 27.2 శాతం జ‌రిమానా ప‌డింది. దీని త‌ర్వాత 10.2 తో ట్రిపుల్ రైడింగ్ ఉంది. ఈ మూడింటితో తెలంగాణ స‌ర్కార్ కు ఏకంగా 74. 7 శాతం ఆదాయం వ‌చ్చింది. అంటే బైక్ న‌డిపించే వారు తెలంగాణ ఆదాయాన్ని పెంచ‌డం కీల‌క పాత్ర వ‌హిస్తున్నార‌ని తెలుస్తుంది. అలాగే లాక్ డౌన్ స‌మ‌యంలో రూ. 613 కోట్లు ఫైన్ విధించారు. అలాగే గ‌త ఆర్నెల్ల నుంచి సీట్ బెల్డ్ ధ‌రించ‌క‌పోవ‌డం, ఓవ‌ర్ స్పీడ్, సిగ్న‌ల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రింక్ అండ్ డ్రైవ్ ల‌త రూ. 2,131 కోట్ల ను పోలీసులు వ‌సూల్ చేశారు.

read more.. మహిళలు, పురుషులు ఏ రోజుల్లో తల స్నానం చేస్తే మంచిదో తెలుసా…ఈరోజుల్లో మాత్రం అస్సలు చేయకండి..!

Visitors Are Also Reading