Home » జ‌పాన్‌లో భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 7.3 న‌మోదు

జ‌పాన్‌లో భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 7.3 న‌మోదు

by Anji
Ad

తూర్పు జ‌పాన్ లో బుధ‌వారం రాత్రి భారీ భూకంపం సంభ‌వించిన‌ది. ఈ భూ ప్ర‌కంప‌న‌లు రాజ‌ధాని టోక్యోను క‌దిలించాయి. భూకంప రిక్ట‌ర్ స్కేలుపై 7.3 తీవ్ర‌త‌గా న‌మోదు అయ్యాయి. ఈశాన్య తీరంలో కొన్ని ప్రాంతాల‌కు సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్టు జ‌పాన్ వాతావ‌ర‌ణ సంస్థ తెలిపింది. భూకంపం పుకుషిమా ప్రాంతంలో 60 కిలోమీట‌ర్ల లోతులో కేంద్రీకృత‌మైన ఉంది. రాత్రి 11.36 గంట‌ల‌కు తాకిన కొద్ది సేప‌టికే తీరంలోని కొన్ని ప్రాంతాలకు ఒక మీట‌ర్ సునామీ అల‌ల హెచ్చ‌రిక జారీ చేసారు.

Advertisement

Advertisement

భూకంపం మూలంగా టోక్యో న‌గ‌రంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. మార్చి 11, 2011 తూర్పు తీరంలో 9.0 తీవ్రత‌లో సంభ‌వించిన భారీ భూకంపం సునామీ త‌రువాత 11 సంవ‌త్స‌రాల క్రితం క‌రిగిపోయిన పుకుషిమా అణు క‌ర్మాగారంలో కార్య‌క‌లాపాల‌ను త‌నిఖీ చేస్తున్న‌ట్టు టీఈపీసీఓ ఓ ట్వీట్‌లో పేర్కొన్న‌ది.

Also Read :  క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ జీవితంలో ఇంత‌టి విషాద‌ముందా..!

Visitors Are Also Reading