Home » Jayaprada: నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష.. కారణం ఏంటంటే?

Jayaprada: నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష.. కారణం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఒకప్పుడు తన నటనతో హీరోయిన్ గా ఒక ఊపు ఊపింది అందాల తార జయప్రద.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి చాలా మంది అభిమానులను సంపాదించుకుంది ఈమె. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలపై ఆసక్తితో అటు వైపు వచ్చారు. 1994 లో రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన జయప్రద ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసారు. ఆ పార్టీ లో అంతర్గత పోరు ఎక్కువ అవ్వడంతో సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ తరువాత 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజక వర్గం నుంచి పార్లమెంట్ లో సభ్యురాలిగా పని చేసారు.

Advertisement

2019 లో బీజేపీ లో చేరిన జయప్రద ఆ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాల్లోనూ సత్తా చాటుతున్న జయప్రదకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె థియేటర్ లో పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వ బీమా కార్పొరేషన్ భవిష్య నిధిని అందచెయ్యని కారణంగా ఫిర్యాదు నమోదు అయ్యింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చెన్నై లో ఎగ్మోర్ కోర్టు లో ఫిర్యాదు చేసింది.

Advertisement

అయితే.. ఈ కేసులో వాదోపవాదాల తరువాత ఆమెకు ఆరు నెలల స్వల్ప కారాగార శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పింది. జయప్రద వార్తలలోకి రావడం గతంలో కూడా జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం జయప్రద థియేటర్ కాంప్లెక్స్ కి సంబంధించి ఇరవై లక్షల ఆదాయపు పన్ను కట్టకపోవడంతో అక్కడి సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు ప్రొజెక్టర్, ఫిలిం రోల్స్, కుర్చీలను తీసేసుకున్నారు. అయితే.. అక్కడి ఉద్యోగులు ఐదు లక్షల రూపాయలను తక్షణ వాయిదా కోసం చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ కింద కట్టించుకున్న. జయప్రదకు కూడా ఐదు వేల రూపాయల పెనాల్టీని వేశారు. అయితే.. ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

యవ్వనంలో ఈ 3 విషయాలకు దూరంగా ఉండండి..! అప్పుడు వృద్ధాప్యం సంతోషంగా గడిచిపోతుంది..!

బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు..!

భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!

Visitors Are Also Reading