Home » తెలంగాణ‌లో 587 ఎస్ఐ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

తెలంగాణ‌లో 587 ఎస్ఐ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

by Anji
Ad

తెలంగాణ‌లో పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం 16,614 స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అందులో మొత్తం 587 ఎస్ఐ పోస్టులున్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ 2022 మే 2 నుండి ప్రారంభం అవ్వ‌నుంది. మే 22, 2022 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్ఐ ఉద్యోగం పొందాడానికి ఏయే అర్హ‌త‌లు ఉండాలి..? ఎస్ఐ జాబ్ కోరుకునే వారికి ఏ క్వాలిఫికేష‌న్ ఉండాలో ఇప్పుడు తెలుసుకోండి.

Advertisement

స్టైపెండ‌రీ క్యాడెట్ ట్రైనీ స‌బ్ ఇన్ ఇన్ స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ (సివిల్‌) -414
స్టైపెండ‌రీ క్యాడెట్ ట్రైనీ రిజ‌ర్వ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్‌) -66
స్టైపెండ‌రీ క్యాడెట్ ట్రైనీ రిజ‌ర్వ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఏఆర్ సీపీఎల్‌) (మెన్‌)-05
స్టైపెండ‌రీ క్యాడెట్ ట్రైనీ రిజ‌ర్వు స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) (మెన్‌) -23
స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ (మెన్‌) ఇన్ తెలంగాణ స్టేట్ స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ డిపార్టుమెంట్ -12
స్టేష‌న్ ఫైర్ ఆఫీస‌ర్ ఇన్ తెలంగాణ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ స‌ర్వీసెస్ డిపార్టుమెంట్ -26
డిప్యూటీ జైల‌ర్ ఇన్ ప్రిజిన్స్ అండ్ క‌రెక్ష‌న‌ల్ స‌ర్వీసెస్ డిపార్టుమెంట్ -8
స్టైపెండ‌రీ క్యాడెట్ ట్రైనీ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆప్ పోలీస్ -22
స్టైపెండ‌రీ క్యాడెట్ ట్రైనీ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ -03
స్టైపెండ‌రీ క్యాడెట్ ట్రైనీ అసిస్టెంట్ స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ -08

Advertisement

ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుండి డిగ్రీ పాస్ కావాలి. 2022 జులై 1 నాటి అర్హ‌త‌లు ఉండాలి. 31వ నెంబ‌ర్ పోస్టుకు ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ లేదా బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 32వ నెంబ‌ర్ పోస్టుకు డిప్లోమా ఇన్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ లేదా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పాస్ కావాలి. 33వ నెంబ‌ర్ పోస్టుకు కంప్యూట‌ర్ సైన్స్ లేదా కంప్యూట‌ర్ అప్లికేష‌న్ లేదా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీతో డిగ్రీ పాస్ అవ్వాలి.

ఇక 11, 12, 13, 14, 16, 17, 18 నెంబ‌ర్ పోస్టుల‌కు పురుషులు 167.6 సెంటీమీట‌ర్లు ఎత్తు ఉండాలి. 11, 12 పోస్టుల‌కు 152.5 సెంటీమీట‌ర్ల ఎత్తు మ‌హిళ‌లు ఉండాలి. ఏజెన్సీ ఏరియాల్లో పురుషులు 160 సెం.మీ. మ‌హిళ‌లు 150 సెం.మీ. ఉండాలి. 31, 32, 33 నెంబ‌ర్ పోస్టుల‌కు పురుషులు 162 సెం.మీ ఎత్తు ఉండాలి. మ‌హిళ‌లు 152.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల‌కు చెందిన వారు పురుషులు 160 సెం.మీ. మ‌హిళ‌లు 150 సెం.మీ ఉండాలి. ఇక లాంగ్ జంప్ ఈవెంట్‌లో పురుషులు 4 మీట‌ర్లు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్ లో ఇద్ద‌రికీ 6 మీట‌ర్ల క్వాలిఫ‌యింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మ‌హిళా అభ్య‌ర్థుల‌కు లాంగ్ జంప్ 2.50 మీట‌ర్లు, షాట్‌పుట్ 4 మీట‌ర్ల క్వాలిఫ‌యింగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక ఆల‌స్యం చేయ‌కుండా ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు సిద్ధ‌మ‌వ్వండి.

SI (Civil) 2022 Notification dt 25-4-2022

Also Read :

అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ లీక్ చేసిన స్నేహా రెడ్డి…ఏంటంటే…?

ఎన్టీఆర్,పవన్, మహేష్ ల మీద వింత కామెంట్స్ చేసిన జగన్నాథ్..! జీరో అయినప్పుడు తోడుగా భార్య తప్ప .!

 

Visitors Are Also Reading