Home » ఎన్టీఆర్,పవన్, మహేష్ ల మీద వింత కామెంట్స్ చేసిన జగన్నాథ్..! జీరో అయినప్పుడు తోడుగా భార్య తప్ప .!

ఎన్టీఆర్,పవన్, మహేష్ ల మీద వింత కామెంట్స్ చేసిన జగన్నాథ్..! జీరో అయినప్పుడు తోడుగా భార్య తప్ప .!

by AJAY
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు పూరి జగన్నాథ్. మొదటి సినిమాతోనే పూరి జగన్నాథ్ సూపర్ హిట్ అందుకున్నారు.

Advertisement

బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజం ఆకట్టుకోవడం… పూరీ చూపించిన కథ కథనం స‌రికొత్త‌గా ఉండ‌టంతో పూరి జగన్నాథ్ కు యూత్ లో ఓ రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా నటించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తో పూరి జగన్నాథ్ మరో సూపర్ హిట్ ను అందుకున్నారు.

puri jagannath marriage

puri jagannath marriage

ఆ తర్వాత పూరి వెనక్కి చూసుకోలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వ‌రుస‌ అవకాశాలు అందుకున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ ఫుల్ బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ హీరోగా ఆంధ్రావాలా సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా డిజాస్టర్ గా గెలిచింది. ఈ సినిమా సమయంలోనే పూరి జగన్నాథ్ ఎంతగానో నమ్మిన అత‌డి స్నేహితుడు నిలువునా ముంచేశాడు. ఏకంగా 80 కోట్ల పైనే పూరిజగన్నాథ్ మోసపోయాడు.

Advertisement

దాంతో అప్పటి వరకు సంపాదించిన ఆస్తులు అన్ని పోయాయి. తాను పెంచుకున్న కుక్కలకు కూడా పూరి జగన్నాథ్ ఆహారం పెట్టలేని స్థితి కి వెళ్ళిపోయారు. అంతేకాకుండా తన పెట్స్ ను ట్రైనర్ కు ఇచ్చి పంపించారు. ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంట్లోకి మారిపోయారు. అప్పటివరకు హుందాగా ఉన్న‌ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. అయితే అలాంటి సమయంలో తాను హిట్స్ ఇచ్చిన ఏ స్టార్ హీరో కూడా ప‌ట్టించుకోలేద‌ని పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ బాధ‌ప‌డ్డారు.

మళ్లీ తన భార్యనే తనకు తోడుగా నిలిచింద‌ని చెప్పాడు. ఇక కమెడియన్ ఆలీ ఒక న‌గను త‌న‌కు ఇచ్చాడ‌ని చెప్పాడు. ఇది పెట్టుకుంటే నీ ఆస్తులు మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పినట్లు తెలిపారు. అలీ చెప్పినట్టుగా తనకు నమ్మకం లేకపోయినా తన భార్యకు ఆ న‌గ‌ను ఇచ్చాన‌ని పూరి జగన్నాథ్ వెల్లడించారు. అలీ చెప్పినట్టుగా తన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయని తెలిపాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. వరుస హిట్లతో దూసుకుపోయారు. ఇక ప్రస్తుతం నిర్మాతగానూ పూరి జగన్నాథ్ సినిమాలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పూరీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ALSO READ :

బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సుకుమార్ మహేష్ సినిమా ‘నేనొక్కడినే’ ఆ కారణాల వ‌ల్లే ప్లాప్ అయ్యిందా ? ?

మీ భార్య లో 5 లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే.! మరి ఉన్నాయో లేదో చూడండి..?

Visitors Are Also Reading