ఏ మహిళ అయినా తను పెళ్లి చేసుకున్న భర్తను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. తన భర్తే సర్వస్వంగా భావిస్తూ ఉంటుంది. భర్త అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలట. భర్తల విషయంలో కొన్ని అవాయిడ్ చేయాలట. ఇందులో మరీ ముఖ్యంగా వారికి వారే తెలివిగలవారు గా భావించే మహిళలు. భర్తల విషయాలు ఇలాంటి పనులు అసలు చేయకూడదు. మరి అవేంటో ఓ లుక్కేయండి..?
Advertisement
డిస్టెన్స్ రిలేషన్షిప్ :
భార్య భర్తల ప్రేమ వర్ణించలేనిది. ఇందులో కొంత మంది భార్యలకు భర్త అంటే చాలా ప్రాణం. ఇలా ఉండటం చాలా మంచిది. కొంతమంది భార్యలు తన భర్తకు అవసరానికి మించి సేవలు చేస్తూ, తాను అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి సేవలు చేయడం మంచిది కాదట.
తరచూ క్షమించరాదు :
భార్య భర్తలు అన్నాక విభేదాలు రావడం చాలా కామన్. ఈ గొడవలో భార్యాభర్తల మధ్య గొడవ ఒకరికి మాత్రమే తప్పు కావచ్చు. ఒకవేళ తప్పు చేసింది నీ భర్త అయితే మాత్రం మీరు క్షమించ వచ్చు. ఇలా ఒక్కసారి జరిగితే క్షమించండి. కాని తరచూ ఇలా తప్పులు చేస్తే మాత్రం.. ప్రతిసారి వారిని క్షమించి వదిలేయడం మంచిది కాదు.
Advertisement
భర్తతో సమయాన్ని గడపడం:
చాలా మంది భార్యలు తన భర్తతో సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు ఎక్కువ సమయం గడపడం కూడా కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల మీకు వారు మాత్రమే సర్వస్వం అని, వారు లేకుంటే బ్రతకలేను అనే భావనకు వస్తారట.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి :
చాలామంది మహిళలు తన భర్త కుటుంబం వంటి వాటిపై దృష్టి పెట్టి వారి గురించి వారు పట్టించుకోవడం మానేసారు. దీని వల్ల ఆరోగ్యం నాశనం అవుతుంది. కాబట్టి వారిపై వారి దృష్టి పెట్టుకొని ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవడం మంచిది.గోల్స్ సాధించాలి:
చాలా మంది భార్యలు వివాహం తర్వాత భర్త సంపాదిస్తున్నాడని, వారు సంపాదనపై పెద్దగా దృష్టి సారించరు. కానీ ఆర్థికంగా బాగుపడాలంటే భార్యలు కూడా ఎంతో కొంత పని చేసి సంపాదిస్తే బాగుంటుంది. దీని ద్వారా మనం అనుకున్న గోల్స్ నెరవేరుతాయి.
ALSO READ;
పెళ్లి తరువాత ఊరేగింపులో ఊరమాస్ డ్యాన్స్‌తో నూతన జంట.. అందరూ ఫిదా
ఒక్కో ఇంటర్వ్యూకు బిత్తిరి సత్తి ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటాడో తెలుసా..!