Home » ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

సాధారణంగా గర్భీణీలు ప్రయాణాలు చేయడం అంత క్షేమం ఏమి కాదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి కాస్త దూరం ప్రయాణిస్తేనే ఇబ్బంది పడే గర్భిణీలు.. ఏకంగా దేశాలు దాటి పోతున్నారు. సరిగ్గా నెలలు నిండిన సమయంలోనే తమ దేశం వీడి.. వేరే దేశానికి క్యూ కడుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నెలల వ్యవధిలోనే 5వేల మందికి పైగా నిండు గర్భిణీలు దేశం దాటి వెళ్లారు. ఏ దేశం యొక్క గర్భిణీలు.. ఏ దేశానికి వెళ్తున్నారు..? అసలు ఎందుకు వెళ్తున్నారు ? వారు చెబుతున్న కారణాలు ఏంటి..? అధికారుల రియాక్షన్స్ ఏంటి అనే పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కొద్ది నెలలుగా రష్యాకి చెందిన 5వేల మందికి పైగా గర్భిణీ స్త్రీలు తమ దేశం వీడి అర్జెంటీనాకు వెళ్లారు. తాజాగా ఒకే విమానంలో 33 మంది నిండు గర్భిణీ స్త్రీలు అర్జెంటీనాకు ప్రయాణం చేయడం సంచలనంగా మారింది. గర్భిణీ స్త్రీలు అందరూ మరో వారం రోజుల్లోనే డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. వీరు అందరూ తమ పిల్లలు అర్జెంటీనాలో పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు. తమ పిల్లలకు రష్యా పౌరసత్వం కంటే.. అర్జెంటీనా పౌరసత్వాన్ని కలిగి ఉండడమే మంచిది అని భావిస్తున్నారు. అర్జెంటీనాలో స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుందనే కారణం చెప్పుకొస్తున్నారు. డాక్యుమెంటేషన్ లో పలు సమస్యల కారణంగా ముగ్గురు గర్భిణీ స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. తాము పర్యాటకులుగా అర్జెంటీనాకి వెళ్తున్నామని రష్యన్ మహిళలు చెప్పారని.. వాస్తవానికి వారి ఉద్దేశం అది కాదని అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Also Read :  నందమూరి కుటుంబానికే ఎందుకు కారు ప్రమాదాలు జరుగుతున్నాయి… వారికి ఆ శాపం తగిలిందా?

 

రష్యన్ మహిళలు తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం కావాలని కోరుకుంటున్నారని.. ఇందుకు ప్రధాన కారణం రష్యన్ పాస్ పోర్ట్ కంటే అర్జెంటీనా పాస్ పోర్ట్ ఎక్కవు స్వేచ్ఛను కలిగి ఉంటుంది. మహిళలు తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం కోరుకోవడానికి ఆదేశ పాస్ పోర్ట్ కారణం. ప్రపంచ వ్యాప్తంగా అర్జెంటీనా పాస్ పోర్ట్ చాలా సురక్షితమైందిగా గుర్తింపు ఉంది. ఈ పాస్ పోర్ట్ హోల్డర్స్ లేకుండా 171 దేశాల్లో ప్రవేశించడానికి వీలు ఉంది. అర్జెంటీనాలో ప్రసవించాలనుకునే తల్లుల కోసం ఆదేశానికి చెందిన కొన్ని ఆసుపత్రులు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి. బర్త్ డేట్ షెడ్యూల్, విమానాశ్రయంలో పికప్, స్పానిష్ పాఠాలు, ఆసుపత్రి బిల్లుల్లో తగ్గింపు వంటి సేవలు అందిస్తున్నాయి. 2015 నుంచి ఈ తరహా ఆఫర్స్ ఇస్తున్నారు.  

Also Read :  రంజిత‌మే పాట‌లో ర‌ష్మిక‌నే బీట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading