పరోటాలు మీరు ఎక్కువగా తింటారా..? అయితే మీకు ఒక సవాల్. రెండు పరోటాలు తింటే లక్ష రూపాయల బహుమతి. జైపూర్‌లో 32 అంగుళాల రెండు పరోటాలను గంటలో తింటే అతనికీ లక్ష రూపాయలు బహుమతి ఆఫర్ చేశారు. ఇది మాత్రమే కాదు ఈ ఫీట్ సాధిస్తే మీకు ఇక్కడ జీవితాంతం పరోటా ఉచితం. జైపూర్‌లోని న్యూ సంగనేర్ రోడ్డులో జైపూర్ పరోటా జంక్షన్ పేరుతో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోంది.
Advertisement
ఇక్కడ 32 అంగుళాల పరోటా లభిస్తుంది. ఇది 4 వేరువేరు పరిమాణాల్లో దొరుకుతుంది. జొమాటో వెబ్సైట్ ప్రకారం.. జైపూర్ పరోటా రెస్టారెంట్లో 72 రకాలకు పైగా 32 అంగుళాల పరోటాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బంగాళదుంప, ఉల్లిపాయ, పనీర్‌తో సహా అనేక రకాల్లో లభిస్తుంది. ఇది రెగ్యులర్, మీడియం లార్జ్, ఎక్స్ ట్రా అనే 04 సైజులతో లభిస్తుంది. మీ ఆకలి మీతో ఎంత మంది వ్యక్తులు ఉన్నారనే దాని ప్రకారం.. మీరు ఆర్డర్ చేయవచ్చు.
Advertisement
- ఈ పరోటా సిద్ధం చేయడం కోసం 5 అడుగుల పాన్ తయారు చేశారు. దీని తయారీకి 5 అడుగుల పాన్ ఉపయోగిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేశారు.
- 40 అంగుళాల రోలింగ్ పిన్ పరోనాటను రోలింగ్ చేయడానికి ప్రత్యేక రోలింగ్ పిన్ తయారు చేశారు. 32 అంగుళాల పరోటాలను రోల్ చేయడానికి 40 అంగుళాల పొడవు గల రోలింగ్ పిన్ ఉపయోగిస్తారు.
- 20 రకాల మసాల దినుసులు ఈ రుచికరమైన పరోటాను తయారు చేయడానికి 20 రకాల మసాలాలు ఉపయోగిస్తారు. ఇవి రుచిని పెంచే ప్రత్యేక మసాలాలు అని చెప్పవచ్చు.
- పరోటాలో 2 కిలోల పిండి, .1.5 కిలోల సగ్గుబియ్యం ఉపయోగిస్తార. బంగాళ దుంపలు, మసాలాలతో తయారు చేసిన సగ్గుబియ్యాన్ని రెండు కిలోల పిండిలో నింపి రోల్ చేయడం అంత సులభం కాదు.
- ఒక పరోటా నలుగురికి సరిపోతుంది. ఒక పరోటాను నలుగురు సులభంగా తినవచ్చు. కట్ చేసిన తరువాత బాహుబలి ప్లేట్లో సాస్, గ్రీన్ చట్నీ, వెల్లుల్లి చట్నీతో సర్వ్ చేస్తారు. ఇది మరింత రుచికరంగా ఉంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం ఎవరైనా సరే ఈ పోటీలో గెలిచి లక్ష రూపాయలు కైవసం చేసుకోండి.
Also Read : జాతీయ జెండాను కప్పి నెమలికి అంత్యక్రియలు.. ఎక్కడంటే..?