Home » కంప్యూటర్ పై పనిచేస్తున్నారా…అయితే కంటి చూపు కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

కంప్యూటర్ పై పనిచేస్తున్నారా…అయితే కంటి చూపు కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

by AJAY
Ad

సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటుంటారు. అంటే అన్ని జ్ఞానేంద్రియాలలో కళ్ళు ముఖ్యమైనవని అర్థం. అయితే మనం చేసే కొన్ని తప్పుల వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ తప్పులు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ప్రస్తుతం ఎక్కువ మంది చేసేవి కంప్యూటర్ ఉద్యోగాలు కాబట్టి అందరూ కంప్యూటర్ స్క్రీన్ ను గంటల తరబడి చూస్తూ ఉంటారు.

Advertisement

అలా ఎక్కువ సమయం కంప్యూటర్ చూస్తూ పని చేయడం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్ ముందు తప్పనిసరిగా ఉండాల్సి వచ్చినప్పుడు త్రీ ట్వంటిస్ అనే సూత్రాన్ని పాటించాలి. (20 – 20-20) ఈ సూత్రం ప్రకారం ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుని కంప్యూటర్ స్క్రీన్ నుండి దృష్టిని పక్కన 20 అడుగుల దూరంలో ఉండే వస్తువుల పై కేంద్రీకరించాలి.

Advertisement

Eye Health

20 సెకన్ల పాటు ఆ వస్తువులను చూడాలి. మళ్లీ 20 నిమిషాల తర్వాత పక్కన ఉన్న ఫోటోను గమనించాలి. అదేవిధంగా కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కంప్యూటర్ ను ఎక్కువగా వాడేవాల్లు యాంటీ గ్లేర్ గ్లాసెస్ ను కచ్చితంగా ధరించాలి. ఇక కంప్యూటర్ పై పనిచేసే వ్యక్తులు కంప్యూటర్ స్క్రీన్ కంటే ఎక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో లో పని చేయాలి. చీకట్లో కంప్యూటర్ ముందు పని చేయడం ద్వారా దాని నుండి వచ్చే కాంతి కండ్ల పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

Visitors Are Also Reading