మంగమ్మగారి మనవడు బాలకృష్ణకు కెరీర్ ను టాప్ గేర్ లోకి తీసుకెళ్లిన సినిమా! భారతీ రాజా తమిళ్ లో తీసిన ‘మణ్ వాసనై చిత్రాన్ని తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో మంగమ్మగారి మనవడు పేరుతో రిమేక్ చేశారు. అయితే ఈ సినిమాకు కీలకమైన మంగమ్మ పాత్రను భానుమతితో చేయించండి, ఒకవేళ ఆమె తిరస్కరిస్తే ఈ సినిమాను తీయకపోవడమే మంచిదని NTR ఖరాఖండిగా చెప్పారు. అంతే కాదు ఆయనే ఫోన్ చేసి
ఈ సినిమాలో నటించేందుకు భానుమతిని ఒప్పించారు. భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు అన్నింటికీ మించి మంచి విలువలు కలిగి ఉన్న మనిషి.
Also Read: కంప్యూటర్ పై పనిచేస్తున్నారా…అయితే కంటి చూపు కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి…!
Advertisement
Advertisement
సినిమా షూటింగ్ కు ముందు కాస్ట్ అండ్ క్రూ అంతా సెట్ అయ్యాక NTR బాలకృష్ణను పిలిచి 3 విషయాలు చెప్పారు. వీటిని షరతులుగా పాటించాలని పేర్కొన్నారు. అవి ఏంటంటే…
1) భానుమతి కంటే అరగంట ముందే షూటింగ్ వద్దకు వెళ్లి రెడీగా ఉండాలి. ఏ ఒక్క రోజు కూడా నీ వల్ల ఆమె వెయిట్ చేయొద్దు.
2) ఆమె కార్ డోర్ నువ్వే తీయాలి
3) ఆమె కార్లోంచి దిగగానే ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి.
NTR పెట్టిన ఈ షరతులను బాలయ్య ఒప్పుకోవడమే కాకుండా షూటింగ్ జరిగినన్ని రోజులు పాటించాడు. సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మర్యాద సినిమా తర్వాత కూడా కొనసాగింది.
Also Read: టాలీవుడ్ ప్రముఖులను వరించని పద్మా అవార్డులు….!