పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ అన్ని పెళ్లిళ్లు అలా ఉండవని చెప్పవచ్చు. పూర్వ కాలంలో పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు మరణించే వరకు కలిసి ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి బంధాలు ఉండటం లేదు. చిన్న చిన్న గొడవలకే విడాకుల వరకు వెళుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరి కొంతమంది డబ్బు మోజు లో పడి ఎక్కువ వయసు ఉన్న వారిని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రేమ అనేది ఎవరెవరీ మధ్య ఎప్పుడు పుడుతుందో తెలియదు. అలా 25 ఏళ్ల అమ్మాయి 45 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వీరి కథేంటో పూర్తిగా చూద్దామా..
Advertisement
Also Read:Tik Tok స్టార్ ప్రేమలత నెల సంపాదన ఇన్ని లక్షలా.. ఎంతో తెలిస్తే నిద్ర పట్టదు..!!
కర్ణాటక కు చెందినటువంటి 45 ఏళ్ల శంకరన్నకు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ఓకే కాలేదు. కానీ ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది ప్రధానంగా ఉంటుంది. ఇంతలోనే భర్త నుంచి విడాకులు తీసుకుని వచ్చిన 25 సంవత్సరాల మేఘనను శంకరన్న ఒక సందర్భంలో కలిశారు. ఇద్దరి మధ్య ప్రేమ కుదిరింది. ఇంకేముంది ఇది కాస్త పెళ్లి వరకు దారి తీసింది. దీంతో వీరి పెళ్లి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలా పెళ్లి అయిన తర్వాత వీరిద్దరూ కలిసి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ కూడా చేసేవారు. వీరి జంటను చూసి ఎంతో మంది వ్యూవర్స్ అభిమానులు పెరిగారు. దీంతో వీరి జీవితం చక్కగా సాగుతూ వచ్చింది.
Advertisement
Also Read:కుంభంలోకి శని తిరోగమనం.. ఆ మూడు రాశుల వారి ఖజానా నిండినట్టే..!
వీరి వీడియోలు చూసిన అందరూ వీరు చాలా సంతోషంగా ఉన్నారు అనుకున్నారు.కానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. శంకరన్న ఆ అమ్మాయితో సరిగ్గా ఉండడం లేదని, ఇద్దరి మధ్య ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదని ఆ అమ్మాయి తరచూ ఫీలయ్యేదట. ఇంతలో ఇద్దరి మధ్య ఆస్తుల విషయంలో గొడవలు వచ్చాయి. ఈ క్రమంలో అత్తా కోడళ్ల మధ్య గొడవ తారాస్థాయికి వెళ్ళింది. కొంత ఆస్తిని తన పేరున రాయాలని మేఘన పట్టుబట్టడంతో శంకరన్న తల్లి అందుకు ఒప్పుకోలేదు. దీంతో మేఘన శంకరన్న ను వివిధ రకాలుగా నిందించింది. చివరికి మనస్థాపానికి గురైన శంకరన్న తన పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని మరణించాడు. మరి ఈ ఘటన పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..
Also Read:బస్ డ్రైవర్ కాబోతున్న బాలకృష్ణ.. అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా..!!