Home » సంక్రాంతి సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ ఇదే.. అల్లుళ్లు ఎవరంటే…?

సంక్రాంతి సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ ఇదే.. అల్లుళ్లు ఎవరంటే…?

by AJAY
Ad

సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పండగ కూడా. ప్రతి ఏడాది సంక్రాంతికి పలువురు స్టార్ హీరోలు సంక్రాంతి అల్లుళ్లు గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా స్టార్ హీరోలు వెనక్కు తగ్గారు. నిజానికి ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ చిత్రాలు అయిన ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

Banggaraju

Banggaraju

కానీ కరోనా కేసులు పెరగడంతో సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నాయి. దాంతో నాగార్జున “బంగార్రాజు” తో ముందుకు వచ్చి సర్ప్రైజ్ చేశాడు. అదేవిధంగా మహేష్ బాబు ఫ్యామిలీ నుండి అశోక్ గల్లా అదేవిధంగా దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఆశిష్ రెడ్డిలు హీరోలుగా పరిచయమయ్యారు. మరోవైపు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ “సూపర్ మచ్చి” సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

ఇక ఈ సినిమాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే బంగార్రాజు కే ఎక్కువ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 39 కోట్లు జరిగినట్టు సమాచారం. ముందు నుండి ఈ సినిమాపై క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయన సినిమా విజయంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Advertisement

Super macchi

Super macchi

మరోవైపు నాగార్జున నాగచైతన్య మల్టీస్టారర్ కావడంతో క్రేజ్ కు తగ్గట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అదే విధంగా రౌడీ బాయ్స్ మరియు హీరో సినిమాలకు భారీగా ఖర్చు చేశారు. అశోక్ గల్లా హీరో సినిమాను 12 కోట్లతో నిర్మిస్తే 8కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. అదేవిధంగా రౌడీ బాయ్స్ సినిమాను 12 కోట్లతో నిర్మిస్తే ఆంధ్రా నైజాంలో దిల్ రాజు ఓన్ గా రిలీజ్ చేశారు.

ఇక మరికొన్ని ఏరియాలలో ఈ సినిమాకు ఆరు కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మెగా అల్లుడు కళ్యాణ్ సినిమా సూపర్ మచ్చిని మేకర్స్ ఓన్ గా రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే రౌడీ బాయ్స్, హీరో సినిమాలకు భారీగా ఖర్చు చేశారు. ఇప్పుడు అంత రిటర్న్ అవుతుందా లేదా అన్నదానిపై ట్రేడ్ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.

Also read : బిజినెస్ మ్యాన్ కు ప‌దేళ్లు…ఆ సీన్ చేసేందుకు న‌మ్ర‌త పర్మిష‌న్ తీసుకున్న మ‌హేశ్..!

Visitors Are Also Reading