Home » 2022కి చాలా వెరైటీగా గుడ్ చెబుతోన్న స్టార్ కపుల్.. వారు ఎవరో గుర్తు పట్టారా..?

2022కి చాలా వెరైటీగా గుడ్ చెబుతోన్న స్టార్ కపుల్.. వారు ఎవరో గుర్తు పట్టారా..?

by Anji
Ad

ఈరోజు 2022లో చివరి రోజు. చివరి వారం. 2022 సంవత్సరానికి వీడ్కోలు చెప్పేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో అందరూ వీడ్కోలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఏడాదిలో చివరి రోజును సెలబ్రెట్ చేసుకునేందుకు ఇప్పటికే ఎవరి ప్లానింగ్స్ వారికి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈవెంట్ ఆర్గనైజర్స్ సైతం పలు రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. నింగికెగిసేలా సంబరాలు జరుపుకోవాలని 2022కి వీడ్కోలు చెబుతూ 2023కి ఆహ్వానం పలకనున్నారు. సాధారణ వ్యక్తుల కంటే ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 

Advertisement

తమకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటారు. ఇప్పటికే కొందరూ సినీ, క్రికెట్ సెలబ్రిటీలు విదేశాలలో వాలిపోయారు. మరికొందరూ స్వదేశంలోనే కొన్ని ప్రాంతాలకు వెళ్లితే.. కొందరూ తమ నివాసంలోనే సెలబ్రెషన్స్ జరుపుకుంటున్నారు. ఇలా ఎవరికీ నచ్చిన విధంగా వారు కొత్తగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ సెలబ్రిటీ జంట నూతన సంవత్సరానికి సరికొత్తగా ఆహ్వానం పలుకుతోంది. పైన ఉన్న ఫోటోలో ఓ స్మిమ్మింగ్ ఫుల్ పక్కన నిలుచొని ఉన్న ఈ కపుల్స్ ఎవరో మీరు గుర్తు పట్టారా..? 

Also Read :  ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రాఘ‌వేంద్ర‌రావు త‌ల్లా….ఆ వార్త‌ల్లో నిజం ఎంత‌..?

 

వారు స్టార్ సెలబ్రిటీలలో ఒకరు. ఈ స్టార్ జంట ఏడాదిలో చివరి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ జంట రెండు రంగాలలో అగ్రగాములు. ఒకరు సినీ రంగంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటే.. మరొకరు క్రీడారంగంలో విశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఈ జంట 2017లో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు.  ఇప్పటికైనా ఈ స్టార్ కపుల్ ఎవరో తెలిసిపోయిందనుకుంటా..? వారెవ్వరో కాదండోయ్.. విరాట్ కోహ్లీ, అనుష్క. ఏ మాత్రం ఖాళీ సమయం లభించినా వెంటనే రెక్కలు కట్టుకొని విదేశాలలో వాలిపోతుంటారు. తాజాగా న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. ఫోటోను షేర్ చేశారో లేదో గంట వ్యవధిలోని 26 లక్షలకి పైగా లైక్స్ రావడం విశేషం. 

Also Read :  Waltair verayya song: వాల్తేరు వీరయ్యలో చిరు వేసిన ఈ షర్ట్ తో రామ్ చరణ్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading