Home » విడాకుల తర్వాత.. సమంత బంపర్ రికార్డు

విడాకుల తర్వాత.. సమంత బంపర్ రికార్డు

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు సినిమాలు.. ఇటు కొన్నిటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ సమంత దూసుకుపోతోంది. అక్కినేని నాగ చైతన్య తో… విడాకులు తీసుకున్న తర్వాత కూడా.. సమంతకు ఇక్కడ క్రేజ్ తగ్గలేదు. వరుసగా ఆఫర్లు ఈ భామను భరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ లోనే కాకుండా.. ఇటీవల హాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది సమంత. బాలీవుడ్లో ఏకంగా మూడు సినిమాలకు సమంత డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప లోని ఐటమ్ సాంగ్ లో సమంత నటిస్తోంది.

Advertisement

Advertisement

ఇలా వరుస ఆఫర్లతో.. స్టార్ హీరోయిన్ సమంత… దూసుకుపోతోంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలోనూ సమంత ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక విషయంపై అప్డేట్ ఇస్తూ… అందరినీ సోషల్ మీడియా వేదికగా ఆకర్షిస్తోంది సమంత. ఈ తరుణంలోనే తన సోషల్ మీడియా వేదిక అయిన ఇంస్టాగ్రామ్ లో అరుదైన ఘనతను సాధించింది ఈ బ్యూటీ. ఇంస్టాగ్రామ్ లో హీరోయిన్ సమంత ను ఫాలో చేస్తున్న వారి సంఖ్య ఏకంగా రెండు కోట్లు దాటేసింది.

ఈ విషయాన్ని స్వయంగా సమంతనే ఆ ఫోటో ద్వారా తెలిపింది. తను అభిమానిస్తున్న వారందరికీ స్పెషల్ థాంక్స్ చెబుతూ ఆ పోస్టర్ ను షేర్ చేసింది సమంత. అక్కినేని నాగచైతన్య కు విడాకులు ఇచ్చిన అనంతరం సమంత ఈ ఘనత సాధించడం విశేషం. ఇది ఇలా ఉండగా మన సౌత్ చిత్ర పరిశ్రమలో సమంత కంటే ముందుగా… రష్మిక మందాన 2.4 కోట్లు, కాజల్ అగర్వాల్ 2.2 కోట్ల తో ముందు వరుసలో ఉన్నారు.

Visitors Are Also Reading