టాలెంటు ఉండాలి కానీ ఎలాంటి అడ్డంకులు వచ్చిన అధిగమించి రాణించగలమని జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలో పుట్టిన ఆయనను వారి కుటుంబం దూరం పెట్టింది. అయినా ఎక్కడ కూడా తగ్గకుండా తన టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మెల్లిమెల్లిగా పాన్ ఇండియా లెవెల్ స్టార్ గా మారారు. ఆయన ఓ లెవెల్ కి వచ్చాక కుటుంబం ఆక్సెప్ట్ చేసింది తప్ప, తన కెరియర్ చెడిపోతే ఎవరు కూడా పట్టించుకునే వారు కాదు కావచ్చు.
also read:చిరంజీవి రీమేక్ చేయాల్సిన బాషా సినిమాను ఎవరు అడ్డుకున్నారు…? వెనకున్న స్టోరీ ఇదే ..!
Advertisement
ఆ కసితోనే ఒక్కోమెట్టు ఎక్కుతూ నందమూరి ఫ్యామిలీని ప్రపంచవ్యాప్తంగా గుర్తుచేసుకునేలా చేశాడు అని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ గతంలో తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి ఒక షోలో కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టారు. అయితే లక్ష్మీ ప్రణతిని తన పెళ్లి చూపుల్లో కొన్ని షాకింగ్ ప్రశ్నలు వేశారట. ఈ టైంలో లక్ష్మీ ప్రణతి మాత్రం తలెత్తి ఎన్టీఆర్ ను చూడలేదట. అయితే పెళ్లి చూపుల్లో పెళ్లంటే నీకు ఇష్టమేనా అని ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి ని అడిగాడట.కానీ లక్ష్మీ ప్రణతి సైలెంట్ గా ఉండిపోయిందట.
Advertisement
also read:
అయితే వీరి ఎంగేజ్మెంట్ కు మరియు పెళ్లికి మధ్యలో 8 నెలల గ్యాప్ వచ్చిందని, ఈ మధ్యలో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని చాలా ప్రశ్నలు వేసేవారట. కానీ ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నో అని చెప్పేదట. ఆ టైంలో ఎన్టీఆర్ కు అర్థం కాలేదట.. ఆడవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం అది తెలిసిన వాడు ప్రపంచాన్నే ఏలుతాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దంపతులకు భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
also read: