కాలం మారింది, ప్రజలకు కూడా మారిపోయారు.. దినదినం ఏ విధంగా అప్డేట్ అవుతున్నారో, ధరలు కూడా ఆ విధంగానే ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం బయట ఫుడ్డు తినడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. అది ధనవంతులకైతే సాధ్యం కానీ సాధారణ మధ్యతరగతి వారైతే ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లి ఆహారం తినడం అనేది కళ.. ఇద్దరు సాధారణంగా భోజనానికి వెళ్తే చిన్న చిన్న హోటల్లలోనే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. అంత చెల్లించడం భారంగా మారుతుంది.
Advertisement
also read:ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి.. జాగ్రత్త..!
ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు వీకెండ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వేలకు వేలు ఖర్చు చేసుకోవాల్సిందే. జేబుగుల్లా కావాల్సిందే.. ఈ విధంగా పెరిగిన ధరలతో ఆహార పదార్థాల ధరలు కూడా అమాంతం పెరిగి సాధారణ మధ్యతరగతి ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.. ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు 26.30 రూపాయలకే నాలుగు రకాల వంటకాలు తనివి తీరా తిని వచ్చేవారు.. అది ఎప్పుడూ,ఎక్కడో ఇప్పుడు చూద్దాం.. నాలుగు దశాబ్దాల క్రితం వంటల ధర ఎలా ఉందో ఈ రెస్టారెంట్ బిల్లు చూస్తే అర్థం చేసుకోవచ్చు..
Advertisement
1985 లో ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఈ బిల్లు వచ్చింది. ఇందులో దాల్ మఖానీ, రైతా, షాహి పనీర్, రోటి ఈ నాలుగు రకాల వంటకాల ధర26.30 రూపాయలు మాత్రమే.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇది 1985 నాటి లాజిజ్ రెస్టారెంట్ & హోటల్ తమ ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.. ఈ పోస్టులో ఆ బిల్లును 20 డిసెంబర్ 1985 అని రాసి ఉంది. ఇది వారు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దీంతో నేటిజన్స్ అప్పటి పరిస్థితులను ఇప్పటి పరిస్థితులను పోల్చి వివిధ రకాలుగా కామెంట్ పెడుతున్నారు. ఎందుకు ఆలస్యం దీనిపై మీరు కూడా కామెంట్ చేయండి..
also read: