Home » తెలంగాణ విద్యుత్ శాఖలో 1601 జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులు… మార్చి 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ విద్యుత్ శాఖలో 1601 జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులు… మార్చి 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలు ఇవే

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అనేక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా, హైదరాబాదులోని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ లైన్ మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 8 నుంచి ప్రారంభమవుతాయి. పదవ తరగతితో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్ మాన్ స్పెషలైజేషన్ లో ఐటిఐ లేదా

Advertisement

Advertisement

ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్మీడియట్ వోకేషనల్ కోర్సులు ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారుల వయసు కచ్చితంగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మార్చి 28, 2023వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.320 లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

ఎస్సి/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.  రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్ 30న జరుగుతుంది. హాల్ టికెట్లు ఏప్రిల్ 24 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.24,340ల నుంచి రూ.39,405ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

READ ALSO : ‘అతడు’ సినిమాలోని ఈ చిన్నోడు..హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు

Visitors Are Also Reading