ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్ థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్ మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సన్ ను చిత్తుగా ఓడించి సంచలనమే సృష్టించాడు. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌కు ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ప్రజ్ఞానంద ఈ విజయంతో 8 పాయింట్లు సాధించి 12వ ర్యాంకుకు చేరుకున్నాడు.
Advertisement
Advertisement
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును తిరగ రాశాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నా ఐదవ అతిపిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజ్ఞానంద పేరు మారు మ్రోగిపోతుంది.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు బంధువులతోప్రేమగా వ్యవహరించాలి