పింక్ బాల్‌తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్‌లో నూతన రికార్డు నమోదు అయింది. ఈ ఫార్మాట్‌లో బెంగళూరు వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్‌లో మొదటి రోజు ఆటలో ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. పింక్ బాల్ టెస్ట్‌మ్యాచ్ చరిత్రలో తొలి రోజే వికెట్లు కూలడం ఇదే ప్రథమం. 2017లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేల మధ్య మ్యాచ్‌లో 13 వికెట్లు, 2018లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 13 వికెట్లు, 2019లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 13 వికెట్లు, 2021లో ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజే 13 వికెట్లు పడ్డాయి. ఈ ఐదు సందర్భాలలో మూడింటిలో టీమిండియా భాగంగా ఉండడం విశేషం.
Also Read : ఝలన్ గోస్వామి రికార్డు.. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్
Advertisement
Advertisement
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (92) ఒంటరి పోరాటం చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్డెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ రనౌట్ అయ్యాడు. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్లు బుమ్రా (3 /15), షమీ (2 /18), లక్షర్ పటేల్ (1/21) ల ధాటికి విలవిలలాడింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఏంజాలో మాథ్యూస్ ధాటిగా ఆడి 43 పరుగులు చేయడంతో లంక జట్టు ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి