Home » అయోధ్య రాములవారి పాదాల చెంత 108 అడుగుల అగరబత్తి.. వీడియో వైరల్..!

అయోధ్య రాములవారి పాదాల చెంత 108 అడుగుల అగరబత్తి.. వీడియో వైరల్..!

by Sravya
Ad

గుజరాత్ లోని వడొదరకు చెందిన బిహాబాయ్ బర్వాద్ అనే రామ భక్తుడు రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగులు పొడవుతో అయోధ్య రాముల వారి కోసం అగరబత్తిని తయారు చేశారు. ఆ భారీ అగర్బత్తి అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. తన గ్రామం నుండి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలి గ్రామం ఈ భారీ అగర్బత్తిని తయారు చేసింది. రాముడికి రోజు ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని ఈ అగర్బత్తిని ఇచ్చినట్లు గ్రామస్తులు చెప్పారు.

Advertisement

Advertisement

ఈ బాహుబలి అగర్బత్తిని తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టిందట. దీనిని తయారు చేయడానికి ఐదు లక్షలు ఖర్చు అయిందట. నెల నుండి నెలన్నర వరకు ఈ అగర్బత్తి వెలుగుతుంది అగర్బత్తి తయారులో 191 కిలోల అవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్ వేశారట. అలానే 425 కిలోల హవాన్ 1475 కిలోల ఆవు పేడ వాడినట్లు తెలుస్తోంది. దీని బరువు 3400 కిలోలు.  అయోధ్య చేరిన ఈ అగర్బత్తిని మంగళవారం నాడు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధ్యక్షుడు మహంతి గోపాల్ దాస్ జి మహారాజ్ సమక్షంలో ముట్టించడం జరిగింది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading