Home » మనదగ్గర 100 కోట్లు వసూల్ చేస్తున్న హీరోలు ఎవరో తెలుసా…?

మనదగ్గర 100 కోట్లు వసూల్ చేస్తున్న హీరోలు ఎవరో తెలుసా…?

by Azhar
Ad

ఒక్క హీరోకు ఒక్కే సినిమాకు 100 కోట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఆ హీరోకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంటె తప్ప అది సాధ్యం కాదు. అయితే ఒకపుడు కేకాలం బాలీవుడ్ హీరోలు మాత్రమే సినిమా కోసం అంతలా వసూల్ చేసేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ అనేది తగ్గి.. సౌత్ రేంజ్ అనేది బాగా పెరుగుతుంది. దాంతో ఇప్పుడు మన హీరోలు కూడా 100 కోట్లు వసూల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలా మన సౌత్ ఇండస్ట్రీలో సినిమాకు 100 కోట్లు వసూల్ చేసే హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

మొదటిసారిగా సౌత్ లో ఒక్క సినిమాకు 100 కోట్లు వసూల్ చేసిన హీరో ఎవరు అంటే.. విజయ్ దళపతి. తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ దాదాపుగా గత మూడు ఏళ్ళ నుండి చేస్తున్న ప్రతి సినిమాకు 100 కోట్లు రెమ్యునరేషన్ అనేది తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ లిస్ట్ లో తర్వాత చేరింది ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఇప్పుడు విజయ్ ను కూడా రెమ్యునరేషన్ క్రాస్ చేసాడు. ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 120 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మహేష్ బాబు కూడా ఇప్పుడు దాదాపుగా 100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక వీరు కాకుండా.. 100 కోట్లకు దగ్గరగా ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు. కేజిఎఫ్ తర్వాత పాన్ ఇండియా హీరో అయిన యష్ ఇప్పుడు కొత్తగా చేయబోయే సినిమాకు 80 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్ లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా తమ రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు సమాచారం. వీరు ఇప్పుడు ఒక్కో సినిమాకు 70 నుండి 80 కోట్ల మధ్యలో వసూల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్ కూడా తన రెమ్యునరేషన్ పెంచి 70 కోట్లు చేసాడట. ఇక ఈ క్రమంలో వీరందరూ త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు అర్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీని టీ20ల్లో నుండి తప్పించాలి అంటున్న జడేజా..!

ఇండియాను ఓడించడం పాకిస్థాన్ కు కష్టమే…!

Visitors Are Also Reading