KRRWorks యూట్యూబ్ ఛానెల్‌లో 1M+ వ్యూస్ సాదించిన తెలుగింటి సంస్కృతి అన్న మ్యూజిక్ వీడియో యొక్క విజయోత్సవ వేడుకలు అద్భుతముగా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఆదివారం, అక్టోబర్ 1వ తేదీన జరిగాయి.
Advertisement
నిర్మాత రాధా కృష్ణ హారతి ఈ విజయానికి దోహదపడిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి, “పెళ్లాం ఊరెళితే” మరియు “ఇంద్ర” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ప్రఖ్యాత సినీ కళాకారిణి ప్రశాంతి హారతి ఈ మ్యూజిక్ వీడియోలో మంత్రముగ్ధులను చేసేలా కొరియోగ్రఫీ చేసి ఒక ముఖ్యమైన పాత్ర వహించారు. చిన్నప్పటి నుంచి తన తల్లి నుండి కూచిపూడి నృత్య కళను నేర్చుకుని ఆమె కుమార్తెన తాన్యా హారతి ఈ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. కిరణ్ గుడిపల్లి గారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహించారు.
Advertisement
ప్రతిభావంతులైన శ్యామ్ కట్రు, పృథ్వీ తేజ మరియు కమల్ నందికొండలతో కూడిన కెమెరా బృందం, మ్యూజిక్ వీడియోలోని ప్రతి క్షణాన్ని కళాత్మకంగా ప్రదర్శించారు.
ఈ వీడియోను తన ప్రతిష్టాత్మక యూట్యూబ్ ఛానెల్ #KRRWorksలో ప్రదర్శించినందుకు, ప్రముఖ దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు గారికి టీమ్ తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
FISD (ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్) వైస్ ప్రెసిడెంట్ మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అయిన గోపాల్ పొనంగి గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు బృందం తమ ప్రగాఢమైన అభినందనలను తెలియజేసారు.
ఈ ప్రాజెక్ట్‌ను ఘన విజయంతో ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అద్భుతమైన 1M+ వీక్షకులకు బృందం వారి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేసారు.