Home » లైవ్ మ్యాచ్ లో మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్ ని హత్తుకున్న బాలుడు.. ఇందుకు హిట్ మ్యాన్ ఏం చేసాడో తెలుసా..?

లైవ్ మ్యాచ్ లో మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్ ని హత్తుకున్న బాలుడు.. ఇందుకు హిట్ మ్యాన్ ఏం చేసాడో తెలుసా..?

by Anji

ప్రస్తుతం న్యూజిలాండ్ తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా జనవరి 21న రాయ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ తో రెండో వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వరుస విరామ సమయంలో వికెట్లను తీశారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.1 ఓవర్లలో సునాయసంగా విజయం సాధించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ (51: 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు), శుభ్ మన్ గిల్ (40 : 53 బంతుల్లో 6 ఫోర్లు) భారత్ విజయంలో కీతక పాత్ర పోషించారు. అయితే భారత జట్టు ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు భద్రతా సిబ్బంది కళ్లను కప్పి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్ లోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మను గట్టిగా హగ్ చేసుకున్నాడు. బాలుడు అకస్మాత్తుగా హగ్ చేసుకోవడంతో హిట్ మ్యాన్ కొద్దిసేపు అయోమయంలో పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన భద్రత సిబ్బంది బాలుడిని రోహిత్ నుంచి వేరు చేసారు. ఇక్కడ రోహిత్ మరోసారి అందరని మనస్సులు గెలుచుకున్నాడు. ఆ బాలుడి ఏమి అనవద్దు అని సెక్యూరిటీకి సూచించడంతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు.  ఈ ఘటన టిక్నర్ వేసిన 10వ ఓవర్ లో చోటు చేసుకుంది.  

Also Read :  India vs New Zealand, 2nd ODI : టీమిండియా జైత్ర యాత్ర.. కివీస్ పై 2-0తో వన్డే సిరీస్ కైవసం

Manam News

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన అభిమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని..  హిట్ మ్యాన్ సూచించడం పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “రోహిత్ మా మనసులను గెలుచుకున్నావయ్యా” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం భద్రత వైఫల్యానికి నిదర్శనమని మరికొందరూ పేర్కొంటున్నారు.  ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.  భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకొని మైదానంలోకి వచ్చి  విరాట్ కోహ్లీ  కాళ్లు మొక్కుతూ పెద్దగా కేకలు వేశాడు.  ఇక అదే సమయంలో సూర్యకుమార్ ఇద్దరినీ కలిపి ఫోటోలు తీయడంతో సోషలో మీడియాతో వైరల్ గా మారింది. ఇవన్ని వినడానికి, చూడడానికి బాగానే ఉన్నప్పటికీ క్రికెటర్ల భద్రత విషయంలో సెక్యూరిటీ సిబ్బంది డొల్లతనం కనిపిస్తూనే ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Also Read :  IPL 2023 కి ముందు RCB బిగ్ షాక్ !

Visitors Are Also Reading