కరోనా మహమ్మారి నుంచి ఇంకా బయటపడక ముందే రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ వచ్చినా ఇంకా పంజా విసురుతూనే ఉంది. మరొక వైపు కొత్త వేరియంట్ అయిన XE ఇప్పటికే చైనా, బ్రిటన్, కెనడా దేశాల్లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా కెనడాలోని జింకల్లో ఈ జాంబి వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇటీవలే కొన్ని సినిమాల్లో మనుషులు జాంబీల్లా మారుతారు. జాంబీ సోకిన మనిషి కరిచిన వారు కూడా జాంబీ బారిన పడుతారు. ప్రాణాంతక డేంజర్ వైరస్ బెంబేలెత్తిస్తోంది. కొన్ని సినిమాల్లో కూడా జాంబీ వైరస్ గురించి చూపించారు. మనుషులు జాంబీల్లా మారుతారు. ముఖ్యంగా జాంబీ వైరస్ సోకిన వారు ఇతరులను కరిచినట్టయితే వారు కూడా ఈ వైరస్ బారిన పడే ప్రమాదముందట. ఇక చైనాలో ఇప్పుడు జింకలు ఇతర జింకలను చంపి తింటున్నాయట. జింకల్లో ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.
Advertisement
Advertisement
అయితే 1996లోనే పశువుల్లో ఈ జాంబీ వైరస్‌ను గుర్తించారు. వాటి శాంపిల్స్ సేకరించి టెస్ట్‌లు చేయగా.. బాక్టీరియా, ఇతర వైరస్‌ల జన్యుసమాచారం లభించింది. అప్పట్లో ఆ వ్యాధిక అడ్డుకట్ట వేసారు. దాదాపు 25 ఏళ్ల తరువాత ఇప్పుడు జింకల్లో జాంబీ వైరస్ బయటపడడం టెన్షన్ పెడుతోంది. ఈ వైరస్ జింకల నుంచి ఇతర జంతువులు, మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని సీడబ్ల్యూడీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ వైరస్ బారిన పడిన వారిలో విరేచనాలు, మానసిక ఒత్తిడి, పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన జంతువు మాంసం తిన్నా.. మలమూత్రాలు లాలాజలం ముట్టుకున్నా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వేటగాళ్లు జాగ్రత్తగా లేకపోతే పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందంటున్నారు. అయితే ఇప్పటివరకు మనుషుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. జాగ్రత్తగా ఉండడం బెటర్ అని సూచిస్తున్నారు.
Also Read : నిహారికకు సపోర్ట్ గా ట్రాన్స్ జెండర్ తమన్నా.. వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!