Zebra Movie Review and Rating: సత్యదేవ్, ప్రియ భవాని శంకర్, డాలీ ధనంజయ,జెన్నిఫర్ పిక్కినాటో, సునీల్, సత్యరాజ్, సత్య తదితరులు జీబ్రా సినిమాలో నటించారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. బాల సుందరం, ఎస్.ఎన్. రెడ్డి, ఎస్ పద్మజ, దినేష్ సుందరం ఈ సినిమాను నిర్మించారు.
సినిమా: జీబ్రా
నటీ నటులు: సత్యదేవ్, ప్రియ భవాని శంకర్, డాలీ ధనంజయ,జెన్నిఫర్ పిక్కినాటో, సునీల్, సత్యరాజ్, సత్య దర్శకుడు: ఈశ్వర్ కార్తీక్
నిర్మాత: బాల సుందరం, ఎస్.ఎన్. రెడ్డి, ఎస్ పద్మజ, దినేష్ సుందరం
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్
రిలీజ్ డేట్ : నవంబర్ 22, 2024
Advertisement
కథ మరియు వివరణ:
ముందుగా కథ ఏంటో చూస్తే.. బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా సూర్య (సత్య దేవ్) వర్క్ చేస్తాడు. ఆయన స్వాతి (ప్రియా భవాని శంకర్) తో లవ్ లో ఉంటాడు. అయితే అనుకోకుండా స్వాతిని ఒక నాలుగు లక్షల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ లో ఇరుక్కుంటుంది. దాని నుంచి బయట తీసుకు రావాలనుకుంటాడు. కానీ ఐదు కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ లో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో డేంజరస్ పర్సన్ ఆది తో తలపడాల్సి వస్తుంది. అసలు అతను ఈ ఐదు కోట్ల రూపాయల సమస్యలో ఎలా ఇరుక్కోవాల్సి వస్తుంది? అసలు దీని నుండి బయటపడతాడా..? తెలియాలంటే మూవీ చూడాలి.
Advertisement
సత్యదేవ్ పర్ఫామెన్స్ ఈ సినిమాలో సూపర్బ్ గా ఉంది. అలాగే డాలీ మంచి నటుడు. ఆయన కూడా చక్కగా నటించారు. ఈ మూవీలో హీరో కంటే పవర్ఫుల్ రోల్ లో అతను కనపడ్డాడు. డాలీ ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి. సత్యదేవ్ కూడా అదరగొట్టేసాడు. అలాగే సత్యరాజ్ టైమింగ్ కూడా బాగుంటుంది. ఈ మూవీ లో సునీల్ కాస్త డిఫరెంట్ రోల్ లో కనిపించరు.
ఇక సంగీతం విషయానికి వస్తే.. మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ కూడ బాగుంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ జీబ్రా సినిమాలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. బ్యాంకుల్లో జరిగే ఫ్రాడ్స్ గురించి మాత్రం క్లారిటీగా చెప్పలేదు. అలాగే 100 కోట్ల రూపాయల సమస్య నుంచి ఒక్క ఈమెయిల్ తో ఎలా తప్పించుకున్నాడు అనేది కూడా సరిగ్గా చెప్పలేదు.
ప్లస్ పాయింట్స్
కథ
నటీ నటులు
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ కొన్ని సీన్స్
కథలో మెయిన్ పాయింట్ కి లాజిక్ లేకపోవడం
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!