ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. 13 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ కూడా రష్యా దాడులను సమర్ధవంతగా తిప్పికొడుతోంది. ఇక రష్యా సైనిక బలం ఉక్రెయిన్ కంటే ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ లో యుద్దం కోసం రష్యా నుండి చాలా యుద్ద వాహనాలు ఉక్రెయిన్ లో దిగాయి.
Advertisement
అయితే ఈ యుద్దవాహనాలు అయిన ట్యాంకులు, మిసైల్ లు, శతఘ్నులు, లాంచర్లు ఇలా ప్రతి వాహనం పై కూడా ముందో వెనకో ఎక్కడో ఒక దగ్గర జెడ్ అనే ఇంగ్లీష్ అక్షరం కనిపిస్తుంది. ఈ అక్షరాన్ని తెలుపు రంగు పెయింట్ తో రాశారు. అయితే ఇలా జెడ్ అనే అక్షరం రాయడం వెనకాల ఓ అర్థం కూడా ఉంది. రష్యాలో జెడ్ అనే అక్షరం రష్యన్ స్పూర్తిని సూచిస్తుందట. జడ్ అంటే రష్యన్ భాషలో జా పోబేడీ అనే అర్థం వస్తుందట.
Advertisement
జా పోబేడీ అనేదానికి తెలుగులో విజయం కోసం అనే అర్థం వస్తుంది. అయితే దీనికి మరో అర్థం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జెడ్ అంటే జపడ్ అనే పదాన్ని సూచిస్తుందని దాని అర్థం పశ్చిమ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రష్యన్ వాహనాలపై జెడ్ అనే అక్షరం కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2014 లో రష్యా క్రిమియాను ఆక్రమించిన సమయంలోనూ రష్యా వాహనాలపై జెడ్ అనే ఆంగ్ల అక్షరాన్ని ముద్రించారు.