ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. ఇందులో టైటిల్ కోసం ఫైనల్స్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ – రాజస్థాన్ రాయల్స్ అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్ గా వ్యవరించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అయితే ఈ ఫైనల్స్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు అందరూ ఇంటికి వెళ్లిపోగా.. కొంత మంది ముంబైలోనే ఆగి పార్టీలు చేసుకుంటున్నారు. అందులో యుజ్వేంద్ర చాహల్, ఆశిష్ నెహ్రా కూడా ఉన్నారు.
Advertisement
ఇక తాజాగా వీరికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో పార్టీ నుండి బయటకు వచ్చిన చాహల్ తాను కారులో వెళ్ళిపోతాను అంటే.. నెహ్రా ఆపి బస్సులో రావాలని అడుగుతున్నాడు. దానికి చాహల్.. నేను నా భార్యతో వచ్చాను. ఇప్పుడు ఆమెను ఎలా వదిలేసి రాగాలను అంటూ కామెంట్స్ చేస్తుంటే.. నెహ్రా చాల భార్య ధనుశ్రీని కూడా బస్సులోకి ఎక్కాలంటూ చెయ్యి పట్టుకొని లాకెళ్తున్నట్లు ఈ వీడియోలు కనిపిస్తుంది. ఇక ఇందులోని చాహల్, నెహ్రా మాటలను చూస్తే అందరికి వారు తాగి ఉన్నట్లు అర్ధం అవుతుంది.
Advertisement
దాంతో ఈ వీడియోపై ప్రజలు కొంచెం నెగెటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. తాగి ఎందుకు అలా రోడ్డు మీద రచ్చ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా అలా ఒక్క అమ్మాయి చెయ్యి పట్టుకొని ఎలా లాగుతున్నావ్ అని నెహ్రాను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ లో గుజరాత్ హెడ్ కోచ్ గా ఉన్న నెహ్రా.. ఐపీఎల్ టైటిల్ అందుకున్న మొట్ట మొదటి భారతీయ కోచ్ గా నిలవగా.. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన 17 మ్యాచ్ లలో 27 వికెట్లు తీసిన చాహల్ కు పర్పుల్ క్యాప్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :