ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పై షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే జనవరి 18న హైదరాబాదులోనే గోల్కొండ రిసార్ట్స్ లో రాజారెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్ తన సతీమణి భారతి తో పాటుగా వచ్చారు. నిశ్చితార్ధ వేడుకల్లో తల్లి విజయమ్మని ఆప్యాయంగా హత్తుకుని మాట్లాడారు. తన మేనల్లుడు రాజారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు కుటుంబం అంతా కలిసి ఫోటో దిగారు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఫిబ్రవరి 17న పెళ్లి జరిగింది జోద్పూర్ లోని ఉమైద్ భావం లో మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకుని ఘనంగా జరిపారు.
Advertisement
ఫిబ్రవరి 14వ తేదీన సాయంత్రమే షర్మిల కుటుంబం జోధ్పూర్ ప్యాలెస్ కి చేరుకున్నారు 16న సంగీత మెహందీ కార్యక్రమం చేయగా, 17న సాయంత్రం ఐదున్నర గంటలకి పెళ్లి జరిగింది. 18వ తేదీ సాయంత్రం ఏడు గంటలకి తలంబ్రాలు వేడుక జరిపారు. వైయస్ షర్మిల కి కాబోయే కోడలు ప్రియా అట్లూరి ఎవరు అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని చర్చిస్తున్నారు. వైఎస్ షర్మిల కాబోయే కోడలు ప్రియ బ్యాగ్రౌండ్ గురించి అనేక వార్తలు వచ్చాయి. అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని ముందు ప్రచారం జరిగింది. అయితే ఆమె అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదని తెలిసింది.
Advertisement
ఆమె బ్రదర్ అనిల్ స్నేహితుడైన అట్లూరి శ్రీనివాస్ మాధవిల కూతురు. అమెరికాలో సెటిల్ అయిన అట్లూరి శ్రీనివాస్ అక్కడ బ్రదర్ అనిల్ కి సంబంధించిన కార్యక్రమాలను కూడా చూసుకుంటారట. ఈ క్రమంలోనే ఈ కుటుంబాల మధ్య రాకపోకలు ఉండడంతో ప్రియ రాజారెడ్డి ప్రేమ మొదలైంది అట్లూరి ప్రియ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆమె. జగన్ ని శత్రువుగా భావించే సామాజిక వర్గం నుండి షర్మిల కోడల్ని తెచ్చుకోవడానికి సంచలనంగా మారింది. అట్లూరి ప్రియా చంద్రబాబు బంధువు అవుతారని కొందరు కామెంట్ చేస్తుంటే కొంతమంది షర్మిల జగన్ ని కాదని బయటకి వెళ్ళినప్పుడే ఆమెతో సంబంధం తెగిపోయింది అని మరికొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అట్లూరి ప్రియా కి చంద్రబాబు కి మధ్య బంధుత్వం ఏమీ లేదు అని కూడా తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!