ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 10 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి… వైసిపి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా… ఏకంగా 150 కి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
Advertisement
అధికారంలోకి రావడమే కాకుండా… ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని కులాలకు అలాగే మతాల వారికి న్యాయం జరిగేలా వివిధ రకాల పేర్లతో సంక్షేమ పథకాలను నడిపిస్తున్నారు సీఎం జగన్. అలాగే సీఎం జగన్ కు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది ఆయన భార్య భారతి రెడ్డి.
Advertisement
జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు… ఆయన వెన్నంటే ఉండి, ముందుకు నడిపిస్తోంది వైఎస్ భారతి రెడ్డి. అయితే, తాజాగా వైఎస్ భారతి రెడ్డి చేతికి తీవ్ర గాయం అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి. ఈ సందర్భంగా వైఎస్ భారతి చేతికి గాయం అయినట్లు.. ఓ పట్టి కట్టుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆమె ఎడమ చేతికి ఈ కట్టు కట్టారు వైద్యులు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది.
ఇవి కూడా చదవండి
అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !
వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్ల ఎంపిక.. రహానేకు కీలక బాధ్యతలు
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు