యూట్యూబ్” ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు ఏదోక సందర్భంలో దీని వాడకం ఉంటుంది. ఏదోక రూపంలో యూట్యూబ్ ను చూస్తూనే ఉంటాం మనం. యూట్యూబ్ లో ఒకప్పుడు ఆదాయం చూసిన వాళ్ళు ఆ రంగం లో నిలబడటానికి భారీగా పెట్టుబడులు పెట్టారు. కొందరు నష్టపోతే మరికొందరు మాత్రం చాలా జాగ్రత్తగా నిలబడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇక యూట్యూబ్ లో ఆదాయం ఏ విధంగా ఉంటుంది…? మనకు చెల్లింపులు ఏ విధంగా చేస్తారు…?
Advertisement
Advertisement
ఒక యూట్యూబర్ (Digital Reading channel) చెప్పిన దాని ప్రకారం చూస్తే…. 100000(లక్ష) వ్యూస్ వస్తే దాంట్లో రెండు సున్నాలు తీస్తే 1000(వెయ్యి రూపాయలు) మనకు యూట్యూబ్ చెల్లిస్తుంది. 10000(పది వేలు) వ్యూస్ వస్తే దాంట్లో రెండు సున్నాలు తీస్తే 100(వంద రూపాయలు) మనకు ఇస్తారు. అలాగే 100(వంద) వ్యూస్ వస్తే దాంట్లో రెండు సున్నాలు తీస్తే 1(ఒక రూపాయి) వరకు వస్తుంది.
యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు ఈ విషయాన్ని బలంగా నమ్మాలని సూచిస్తున్నారు. యావరేజ్ గా ఈ విధంగా రెవెన్యూ ఉంటుంది. ఇక వీడియోను వేగంగా చూసే రేటును బట్టి, వీడియో మీద వీక్షకులు వెచ్చించే సమయం ఆధారంగా రేటు మారుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో రేటును బట్టి కొంచెం అటు ఇటు గా లెక్క మారవచ్చు గాని దాదాపుగా ఇదే రేటు ఉంటుంది.