సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ చాలామంది హీరోలుగా సక్సెస్ అవ్వలేకపోయారు. నిజానికి బయటి వాళ్ళ కంటే బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లపైనే సక్సెస్ అవ్వాలని ఎక్కువ ప్రెజర్ ఉంటుంది.
Advertisement
కానీ ఆ ప్రెజర్ ని తట్టుకుని కొంతమంది స్టార్ హీరోల కుమారులు సైతం స్టార్ హీరోలుగా ఎదిగారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం….
నందమూరి తారక రామారావు తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య స్టార్ హీరోగా ఎదిగారు. యాక్షన్ సినిమాలతో పాటు జానపద చిత్రాలతోనూ బాలయ్య ప్రేక్షకులను మెప్పించారు. ఎలాంటి పాత్రనైనా చేస్తూ ఇప్పటికీ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదిగారు. మహేష్ బాబు వరుస సూపర్ హిట్లను అందుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ పొజిషన్ లో ఉన్నారు.
Advertisement
నందమూరి హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్ కూడా తండ్రి బాటలో నడిచి స్టార్ హీరోగా ఎదిగారు. హరికృష్ణ చేసింది మూడు నాలుగు సినిమాలు అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చిన హీరో రామ్ చరణ్ చిరంజీవి వారసుడు కావడంతో భారీ అంచనాల మధ్య టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. రెండో సినిమా మగధీరతోనే రామ్ చరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు.
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాకుండా నాగార్జున కుమారుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కూడా హీరోగా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.