Home » రాజ‌స్థాన్ నుండి ఢిల్లీ వ‌ర‌కు ప‌రిగెత్తిన యువ‌కుడు… ఎందుకోతెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

రాజ‌స్థాన్ నుండి ఢిల్లీ వ‌ర‌కు ప‌రిగెత్తిన యువ‌కుడు… ఎందుకోతెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

ఓ యువ‌కుడు 50 గంట‌ల్లో 350 కిలోమీట‌ర్లు ప‌రిగెత్తాడు. అయితే ఆ యువ‌కుడు ఎందుకు ప‌రిగెత్తాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. రాజ‌స్థాన్ లోని సురేష్ బిచార్ అనే 24 ఏళ్ల యువ‌కుడు రాజ‌స్థాన్ లోని నౌగ‌ర్ జిల్లాలో కుటుంబంతో క‌లిసి నివసిస్తున్నాడు. కాగా సురేష్ రాజ‌స్థాన్ లోని సికార్ నుండి ఢిల్లీ వ‌ర‌కు ప‌రిగెత్తాడు. దాంతో మీడియా అతడి వ‌ద్దకు వెళ్లి ఇలా ఎందుకు ప‌రిగెత్తారంటూ ప్ర‌శ్నించింది.

Advertisement

Advertisement

దానికి సురేష్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. త‌న‌కు ఆర్మీలోచేరాల‌ని ఉంద‌ని చెప్పాడు. దేశానికి సేవ చేయ‌డ‌మే త‌న ఆశ‌య‌మ‌ని అన్నాడు. కానీ రెండేళ్లుగా రిక్రౌట్మెంట్ లు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌న‌కే కాకుండా త‌మ ప్రాంతంలో చాలా మందికి ఆర్మీలో చేరాల‌ని ఉంద‌ని కానీ రిక్రౌట్మెంట్ లేద‌ని చెప్పాడు. అంతే కాకుండా దేశానికి సేవ చేయాల‌ని అనుకునే త‌న వ‌య‌సు కూడా దాటిపోతుంద‌ని దాంతో వ‌యోప‌రిమితి ఉండ‌ని చెప్పాడు. మీడియా దృష్టిని ఆక‌ర్షించేందుకే తాను ఇలా ప‌రిగెత్తాన‌ని చెప్పాడు.

Visitors Are Also Reading