ప్రస్తుత కాలం లో చిన్న పిల్లలు బయటకు వెళ్లినా.. అలాగే ప్రతి రోజు ఉదయం కూడా చిన్న పిల్లలకు దిష్టి తీస్తారు. దిష్టి తీయడం అనే ప్రక్రియ పూర్వ కాలం లో నుంచి వస్తున్నా.. దిష్టి ఎందుకు తీస్తారో అనే కారణం మాత్రం చాలా మందికి తెలియదు. కానీ పూర్వ కాలం నుంచి తర తరాలగా చిన్న పిల్లలకు దిష్టి తీయడం అనే ఆచారం మాత్రం వస్తునే ఉంది. ఒకరిని చూసి ఒకరు ఇలా చిన్న పిల్లలకు దిష్టి తీస్తూ వస్తారు. అయితే ఇప్పుడు మనం చిన్న పిల్లలకు దిష్టి ఎందుకు తీస్తారో మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
చిన్న పిల్లలు బయటకు వెళ్లిన సమయాల్లో, పండుగుల సమయాల్లో, పుట్టిన రోజు వంటి శుభకార్యాలు చేసిన సమయాల్లో దిష్టి తీస్తూ ఉంటారు. హారతి ఇచ్చి, ఎర్రటి నీళ్లతో, ఉప్పు తోపాటు మరికొన్ని పద్దత్తు లతో దిష్టి తీస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చెడు దృష్టి పిల్లలపై పడితే అది తొలగి పోతుంది. అలాగే ఇతరుల దృష్టి దోహం చిన్న పిల్లలకు పడితే.. అది కూడా పోతుంది. అలాగే దీష్టి తీయడం వల్ల పిల్లల చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
పిల్లలు యాక్టివ్ గా కనిపిస్తారు. అలాగే పిల్లలు చుట్టూ ఎక్కువ మంది ఉండటం వల్ల పిల్లలు ఆనారోగ్యానికి గురి అవుతారు. అలాంటి సందర్భం లో వారికి నిప్పు తో దిష్టి తీస్తే ఆ సమస్య కొంత వరకు తగ్గుతుంది. అలాగే ఎర్రటి నీటి తో దిష్టి తీయడం వల్ల.. ఎర్ర రంగు ఉన్న నీటి ని ఎక్కువ సార్లు చూస్తే పిల్లలు యాక్టివ్ గా కనిపిస్తారు. ఈ కారణా లతో చిన్న పిల్లలకు దిష్టి ని తీస్తారు.