ఈ మధ్య కాలంలో ప్రతి షాపింగ్ మాల్స్ లలో, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లలో లిఫ్ల్ లు ఎక్కువగా పెడుతున్నారు. దీంతో మెట్లు ఎక్కుకుండా సింపుల్ గా లిఫ్ట్ ఎక్కెసి పదుల సంఖ్య ఫ్లోర్ లను సెకన్లలో దాటేస్తున్నారు. అయితే మనం లిఫ్ట్ లు ఎక్కిన సమయంలో మనకు ఎక్కువగా కనిపించేవి మిర్రర్స్. దాదాపు చాలా లిఫ్ట్ లలో మిర్రర్స్ ను అమర్చుతారు. అయితే లిఫ్ట్ లకు మిర్రర్స్ ఎందుకు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
లిఫ్ట్ లలో మిర్రర్స్ పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్య మైనది సేఫ్టీ. లిఫ్ట్ లలో ఎక్కువ మంది ఉన్న సమయంలో ఎవరైనా చోరీ చేస్తే చుట్టు ఉన్న మిర్రర్స్ లతో సింపుల్ గా కనిపిస్తుంది. అలాగే ఎవరిపైనా దాడి చేసినా తెలిసిపోతుంది. లిఫ్ట్ లలో ఎక్కువ మంది లేక పోతే కొంత మంది క్లాస్ట్రోఫోబియా వస్తుంది. దీంతో వారిలో ఆందోళన పెరుగుతుంది. అయితే చుట్టు మిర్రర్స్ ఉండటం వల్ల మన చుట్టు మంది ఉన్న ఫీలింగ్ వస్తుంది. దీంతో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.
Advertisement
అలాగే వీల్ చైర్ లో ఉండే వారికి కూడా మీర్రర్స్ ఉపయోగపడుతాయి. వీల్ చైర్ లో ఉన్న వారు వెనక్కి తిరిగి చూడకుండానే తమ ఎక్స్ ప్రెషన్స్ వెనక వారికి చూపించవచ్చు. అలాగే లిఫ్ట్ లో నిల్చునే వారు బోరుగా ఫీల్ అవుతారు. అయితే అప్పుడు అద్ధాలు ఉంటే.. తమ అందాన్ని చూసుకుంటారు. అలాగే తమ ఫేస్ కు వేసుకున్న మేకప్ లో ఏదైనా మార్పు వస్తే సరి చేసుకుంటారు. అలాగే కొంత మందికి అద్ధాన్ని చూస్తే సమయం తెలియదు. అందుకే లిఫ్ట్ లలో మిర్రర్స్ ను అమర్చుతారు.