Home » తారకరత్న హీరోయిన్ సీఎం భార్య అని మీకు తెలుసా ..?

తారకరత్న హీరోయిన్ సీఎం భార్య అని మీకు తెలుసా ..?

by Sravanthi
Ad

నందమూరి ఫ్యామిలీలో చిన్న వయసులోనే కన్నుమూసిన తారకరత్న కుటుంబం అనాధగా మారింది. పాపం తారకరత్నకు మొదటి నుంచి ఏ పని చేసినా కలిసి రాలేదు. సినిమాల్లోకి స్టార్ హీరోగా ఎదగాలని ఎంతో ఆశతో వచ్చారు. కానీ ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా అంతగా ఆడక పోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి కుటుంబానికి దూరమయ్యారు. కనీసం రాజకీయాల్లోనైనా రానిద్దామని భావించి నారా లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ పూర్తిగా ఈ లోకానికి దూరమయ్యారు తారకరత్న.

Advertisement

అలాంటి తారకరత్న మరణించిన తర్వాత అనేక వార్తలు ఆయన గురించి సోషల్ మీడియాలో వస్తున్నాయి.. తాజాగా ఈ వార్త మాత్రం తెగచక్కర్లు కొడుతుంది .. అదేంటయ్యా అంటే తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో తారకరత్న సరసాన నటించిన హీరోయిన్ పేరు రాధిక. అయితే ఈ హీరోయిన్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఆమె సినిమాలో నటిస్తున్న టైంలోనే కుమార స్వామికి మరియు రాధికకు మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.

Advertisement

వీటన్నింటికీ తాళం వేసేలా కుమారస్వామి రాధికను పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు తెరపడినట్టు అయింది. అయితే రాధిక కొన్ని చిత్రాలు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత కన్నడ చిత్రాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించింది. అంతేకాకుండా భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా రాణిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తారకరత్న పక్కన మాజీ సీఎం భార్య కూడా నటించిందా అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

also read:

Visitors Are Also Reading