దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. ఇటీవల కాలంలో ఓటీటీ లో కూడా విడుదలైంది. ఈ మూవీ ఉత్తరాదిలో కూడా సక్సెస్ అయింది. దీంతో జక్కన్న ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది అని చెప్పవచ్చు.
Advertisement
సినిమాలో ఎన్టీఆర్ భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరిగా నటించి మెప్పించారు. ఈ తరుణంలోనే అన్ని సినిమాల్లో చిన్న చిన్న విషయాలను దర్శకులు జాగ్రత్తగా దగ్గరుండి ఈ విధంగా చూసుకుంటారో ఆ విధంగానే రాజమౌళి కూడా పరిశీలిస్తుంటారు. అయితే ఆయన చేసిన కొన్ని సినిమాలను గమనిస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి.. అయితే త్రిబుల్ ఆర్ మూవీలో కూడా ఒక చిన్న విషయం బయటపడింది అదేంటో చూడండి..?
ఈ సినిమాలో నదిలో ఒక బాలుడు పడవపై చిక్కుకున్నప్పుడు రామ రాజు మరియు భీమ్ ఇద్దరు తాడుతో ఊగుతూ చెరోవైపు వస్తారు. అయితే అప్పటి వరకు రామరాజు భారతీయ జెండాను పట్టుకుని వస్తాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి బాలున్ని రక్షిస్తారు. కానీ అందులో ఆ జెండా గురించి మాత్రం మీరు తెలుసుకోవాలి. అందులో వాడిన జెండా మొదటి భారతీయ జెండా..1906 ఆగస్టు 7వ తేదీన వాడుకలోకి వచ్చింది. ఆ సమయంలో కోల్కతా లోని పర్శి భగన్ చౌక్ లో దీన్ని తొలి సారి ఆవిష్కరించారు. కానీ జెండాను ఏడాది మాత్రమే వాడారు.
Advertisement
1907 మళ్లీ జెండా మారిపోయింది. అయితే అప్పటి జెండాపై వందేమాతరం అనే అక్షరాలు కూడా ఉంటాయి. పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు రంగు, కింద ఎరుపు ఉంటాయి. ఈ రంగుల పైన కూడా పలు రకాల చిహ్నాలతో ఉంటుంది. అయితే ఈ సినిమాలో చూపించిన జెండా మాత్రం 1906 లో ఆవిష్కరించిన జండా.. కాబట్టి సినిమాలోని కథ కూడా 1906 జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా జక్కన్న చాలా చిన్న చిన్న విషయాలను జాగ్రత్త వహిస్తూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయాలను అందుకుంటాయి.
also read;
మురళీమోహన్: NTR ను నమ్మించి మోసం చేశారు.. ఆరోజు రాత్రి అలా జరగడంతో నా కడుపు మండిపోయింది..?
మీ భార్య ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త మీకు కూడా ఇలానే జరగవచ్చు..?