Home » భార‌తీయ డ్రైవింగ్ లైసెన్స్ ఈ దేశాల్లో కూడా ప‌నిచేస్తుంద‌ని తెలుసా..?

భార‌తీయ డ్రైవింగ్ లైసెన్స్ ఈ దేశాల్లో కూడా ప‌నిచేస్తుంద‌ని తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

రోడ్డు ఎక్కాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. ఏ దేశంలో అయినా వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే భారత్ లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ కొన్ని దేశాల్లో పని చేయదు…కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇండియ‌న్ లైసెన్స్ తో కూడా చ‌క్క‌ర్లు కొట్ట‌వ‌చ్చు. అలా ఇండియాలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ఏ దేశంలో పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

driving licence

driving licence

హాంకాంగ్ దేశంలో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కు ఏడాదిపాటు అనుమతులు ఉన్నాయి. టూర్ ప్లానింగ్ చేసుకునేవారు ఈ దేశంలో వాహనాలను అద్దెకు తీసుకొని ఇండియన్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేయ‌వ‌చ్చు. న్యూజిలాండ్ లో కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కు అనుమతి ఉంది. ఇక్కడ కూడా ఏడాదిపాటు ఇండియన్ లైసెన్స్ తో వాహనాలు నడవచ్చు. మలేషియాలో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి రోడ్డుపై అనుమతి ఉంది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీష్ లో లేదంటే మలై లో మాత్రమే ఉండాలి. అంతే కాకుండా దానిని మలేషియా ఇండియన్ ఎంబసీ గుర్తించాలి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు స్వీడ‌న్ లో కూడా అనుమతి ఉంది. కానీ లైసెన్స్ ఇంగ్లీష్ లో లేదా ఫ్రెంచ్ లో గానీ ఉండాలి.

Advertisement

Advertisement

సింగపూర్ లో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు అనుమతి ఉంది. ఒక ఏడాది పాటు సింగపూర్ లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది. స్విజ‌ర్లాండ్ లో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు ఏడాదిపాటు అనుమతులు ఉన్నాయి. స్విట్జర్లాండ్ లో వాహనం తీసుకొని ఇండియన్ లైసెన్స్ తో ఏడాదిపాటు నడపవచ్చు. ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు అనుమతులు ఉన్నాయి. కానీ చిన్న చిన్న కండిష‌న్లు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో వాహ‌నం న‌డ‌పాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీష్ లోనే ఉండాలి. అంతే కాకుండా ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు మూడు నెలల పాటు మాత్రమే అనుమతి ఉంటుంది. మన దేశంలో మాదిరిగానే ఆస్ట్రేలియాలో కూడా ఎడమవైపు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ద‌క్షిణాఫ్రికా, జ‌పాన్, జ‌ర్మనీ దేశాల‌లో కూడా ఇండియ‌న్ లైసెన్స్ తీసుకుని రోడ్ల‌పై చెక్క‌ర్లు కొట్ట‌వ‌చ్చు.

also read :ప్రాణం కాపాడే ఈ ట్రిక్ ఎలా చేయాలో 98శాతం ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌ట‌..!

Visitors Are Also Reading