భారతదేశంలో పూర్వకాలంలోనే బ్రహ్మంగారు కాలజ్ఞానం రూపంలో కొన్ని విషయాలను చెప్పారు. అందులో చాలావరకు నిజం అవుతూ వస్తున్నాయి. ఇది మన దేశంలో మాత్రమే నమ్ముతారు. ముఖ్యంగా జాతకాలు, హస్త రేఖలు, పుట్టుమచ్చలు వంటి వాటిని చూసి మన భవిష్యత్తును చెప్పినటువంటి కొంతమంది పండితులు ఉన్నారు. మరి ఆ విధంగానే మా శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మనకు అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం..? ముఖ్యంగా జ్యోతిష్యశాస్త్రంలో పుట్టుమచ్చల శాస్త్రం అనేది ఒక భాగం. మన శరీరంలో నుదుటి పై భాగంలో పుట్టుమచ్చలు అనేవి ఉంటే వారికి రాజకీయ యోగం, అంతరిక్షంలో ప్రయాణం చేసే వాటిలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే నుదిటి కింద భాగంలో పుట్టుమచ్చలు ఉన్నట్లయితే ముఖ్యంగా ఛాతి భాగంలో పుట్టుమచ్చ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Advertisement
Advertisement
చేతుల భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఎక్కువగా క్రీడల్లో రాణిస్తారు. ముఖ్యంగా అరచేతిలో ఏ స్థలంలోనైనా పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వారి చేతులతో ఎవరికి సాయం చేసిన, వ్యాపారం కోసం డబ్బులు ఇచ్చిన వారు అభివృద్ధి చెందుతారు. ఇందులో ముఖ్యంగా మగవారికి అయితే కుడి భాగం, ఆడవారికి ఎడమ భాగంలో పుట్టుమచ్చలు ఉంటే దాని ప్రభావం అనేది బాగా పని చేస్తోందని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంకా అరికాలు మీద పుట్టు మచ్చ ఉన్నట్లైతే వారు ఎప్పుడైనా సరే నికరంగా కూర్చోరు. ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో ఎప్పుడూ ఏదో చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా వీరు విదేశీ గడ్డపై అడుగుపెట్టే అదృష్టం ఉంటుంది. వెన్నెముక మీద పుట్టు మచ్చ ఉన్నట్లైతే రాజకీయాల్లో రాణిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి వెన్నుపూసపై పుట్టుమచ్చ ఉండటం వల్ల ఆయన రాజకీయాల్లో రాణించారు. ముఖ్యంగా ఈ పుట్టుమచ్చలు నలుపు రంగులో ఉండాలి. అవి కూడా ఆవగింజంత పరిమాణంలో ఉంటేనే మంచి ఫలితాలనిస్తాయి. కంట్లో పుట్టుమచ్చ ఉన్న వారికి వారు ఏది చూసినా అదృష్టం వరిస్తుంది. ఛాతి భాగంలో కాని పొట్ట భాగంలో కాని పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.