KKR జట్టు ఎంత భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు ని ఐపీఎల్ లో అండగ్ డాగ్స్ అనొచ్చు. గంభీర్ కెప్టెన్సీలో గతంలో రెండు సార్లు కప్ గెలిచింది. కానీ ఆ తర్వాత నుంచి ప్రతి సీజన్లో తడబడుతూనే వస్తుంది. ఈసారి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అందరూ అనుకున్నారు. కానీ మొన్న ఆర్సీబీతో మ్యాచ్ లో శార్దూల్ సూపర్ బ్యాటింగ్ చేస్తే… పోయిన ఆదివారం గుజరాత్ పై రింకు చెలరేగి ఆడాడు.
READ ALSO : ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !
Advertisement
విజయానికి 29 పరుగులు అవసరమైన దశలో ఏకంగా 5 సిక్సులు బాది శభాష్ అనిపించుకున్నాడు. రింకు దెబ్బకు బలైపోయిన బౌలర్ యష్ దయాల్ మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లోనే బ్యాండ్ తో ముఖం కప్పేసుకున్నాడు. ఒక ఓవర్ ఒకరిని హీరో చేస్తే… మరొకరిని జీరో చేస్తుంది. రింకూసింగ్ దెబ్బకు యష్ దయాల్ ఈ సీజన్లో మరొక మ్యాచ్ ఆడలేకపోయాడు. అందుకు వేరే కారణం కూడా ఉంది.
Advertisement
READ ALSO : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉద్యోగాలు…జీతం రూ. 35 వేలు
ఆ ఒక్క ఓవర్ జీవితాన్ని తలకిందులు చేసింది. తన వల్లే గుజరాత్ ఓడిందని మానసికంగా బాగా దెబ్బతిన్న యష్ దయాల్ అనారోగ్యం బారిన పడ్డాడు. దాదాపు 7 నుంచి 9 కిలోల బరువు తగ్గిన యష్ వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ పై విజయం అనంతరం మాట్లాడిన పాండ్యా…. యష్ దయాల్ పరిస్థితిని వివరించాడు.
READ ALSO : Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని… ఏపీలో ఎక్కడంటే?