Home » Yadamma Raju : రెండో పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు..!

Yadamma Raju : రెండో పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు..!

by Bunty
Ad

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది చాలా కష్టపడి… ఇండస్ట్రీలో ఎదిగారు. మరి కొంతమంది బ్యాక్ గ్రౌండ్ చూసుకొని… ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే యాదమ్మ రాజు అనే కమెడియన్ మాత్రం… తన సొంత టాలెంట్ ను ఉపయోగించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

yadamma-raju-remarried

yadamma-raju-remarried

ఈటీవీలో ప్రసారం అయిన పటాసు అనే కామెడీ షో ద్వారా… తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత జీ తెలుగు ఛానల్ నిర్వహించిన అదిరింది అనే కామెడీ షో తో.. జబర్దస్త్ లోకి కూడా వచ్చాడు యాదమ్మ రాజు. ప్రస్తుతం సినిమాలలో వరుసగా నటిస్తున్నాడు. ఇప్పటికే గువ్వా గోరింకా, జార్జి రెడ్డి, హలో గురు ప్రేమకోసమే మరియు విద్యార్థి లాంటి ఎన్నో సినిమాలు చేశాడు యాదమ్మ రాజు. ఇది ఇలా ఉండగా యాదమ్మ రాజు మరోసారి పెళ్లి చేసుకున్నాడు. అయితే స్టెల్లాను కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని అనుకుంటున్నారా ? అస్సలు కాదండోయ్..!

Advertisement

Advertisement

స్టెల్లాను మరోసారి యాదమ్మ రాజు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే వీరు పెళ్లి చేసుకొని దాదాపు ఏడాది గడుస్తోంది. ఈ సమయంలో తమ వివాహాన్ని చట్టబద్ధం చేయాలని ఉద్దేశంతో మరోసారి వీరు పెళ్లి చేసుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని తెలుస్తోంది. అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం వీరిద్దరూ భార్యాభర్తలు ఇప్పుడు అయ్యారన్నమాట. దీనికి సంబంధించిన వీడియో మరియు ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Mahesh Vitta Marriage : ప్రియురాలితో ఏడడుగులు వేసిన మహేష్‌విట్టా

Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. ?

విజయ్‌ దేవరకొండ కీలక ప్రకటన.. ఫ్యాన్స్‌కు రూ.కోటి ఇస్తానంటూ ప్రకటన..

Visitors Are Also Reading