టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపినెస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా తలపడుతోంది. మొన్న జనవరి 7వ తేదీన ఈ మ్యాచ్ ప్రారంభం కాగా… ఇవాళ మూడో రోజు కొనసాగుతోంది. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఘోరంగా విఫలమవుతోంది. ఇక మొదటి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులు చేసి గట్టి స్థానంలో ఉంది.
Advertisement
ఇక అటు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కష్టాల్లో పడింది. 260 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి.. ఎదురీదుతోంది. ఈ తరుణంలోనే టీమ్ ఇండియా పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికి పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ చేసిన తప్పిదం వల్ల టీమ్ ఇండియా ఇప్పుడు కష్టాల పాలు అయిందని రికీ పాంటింగ్ అన్నారు. ప్రస్తుతం పాంటింగ్ కామెంట్రి సెక్షన్ లో కామెంట్ చేస్తున్నాడు.
Advertisement
మొదటి ఇన్నింగ్స్ కోసమే టీమిండియా జట్టును రోహిత్ శర్మ సెలెక్ట్ చేసినట్లు కనబడుతూ ఉందని…. రోహిత్ శర్మ ట్రాప్ లో పడినట్లు స్పష్టంగా అర్థమవుతుందని పాంటింగ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా జట్టులో లెఫ్టెండర్లు ఉన్నారని… ఇలాంటి తరుణంలో స్పిన్న ర్ రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకోక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద తప్పిదం చేసినట్లు పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ అశ్విని జట్టులో ఉంటే ఆస్ట్రేలియా జట్టు చాలా కష్టాల పాలు అయ్యేదని ఆయన వెల్లడించారు. కానీ ఇప్పుడు పరిస్థితి దాటిపోయిందని చెప్పారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!
రైల్వే స్టేషన్ మాస్టర్ జీతం, లభించే సదుపాయాల గురించి తెలుసా?
Virat Kohli: అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన కోహ్లీ..!