ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన నీతి శాస్త్రంలో జీవితంలో ఉపయోగపడే ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా వివరించాడు. ముఖ్యంగా ఇంట్లో స్త్రీ పాత్ర గురించి చాలా ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. కుటుంబంలోని వస్తువులను తయారు చేయడంలో, క్షీణించడంలో స్త్రీ పాత్ర చాలా కీలకం. జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం చాలా ముఖ్యం. జీవిత భాగస్వామి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ మనిషి జీవితంలో పశ్చాతాపం తప్ప ఏమి మిగలదని చాణక్య చెప్పారు. స్త్రీల గుణాలు కుటుంబం సంతోషకరమైన భవిష్యత్‌ని నిర్ణయించగలవు. ఆమెలో ఉన్న లోపాలు కుటుంబాన్ని నాశనం చేయగలవు. కొంతమంది మహిళల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దూషించే అలవాటు ఉన్న స్త్రీలు తమ ఆనందాన్ని మాత్రమే కాదు.. ఇతర కుటుంబ సభ్యుల ఆనందాన్ని కూడా లాగేసుకుంటారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. వీరిలో ఈ అలవాట్లు కుటుంబాల్లో అపార్థాలు సృష్టించడం ద్వారా ద్వేషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఎవరైనా ఒక విషయం చెబితే ఆ విషయాలు విన్న వెంటనే ఇతరులకు చెప్పడం స్త్రీల చెడ్డ అలవాటు. ఈ అలవాటు వల్ల ఒక్కోసారి చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Chanakya Niti : ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే ఆర్థిక సమస్యలు ప్రారంభమైనట్టే..!
కోపం ఉన్న వ్యక్తి ప్రవర్తన ఆ కుటుంబంలో గొడవల వాతావరణం సృష్టిస్తుందని ఆచార్య చాణక్య చెప్పాడు. ఇలాంటి ప్రవర్తన స్త్రీలే కాదు.. పురుషులకు కూడా ఉండరాదు. కోపం అనేది ఒక భావన. ఇది రాకుండా ఆపలేము. తనపై తాను నిగ్రహాన్ని ఉంచుకోవడం ద్వారా కోపాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవచ్చు. కోపాన్ని తనపై ఆధిపత్యం చెలాయిచనివ్వని వ్యక్తి విజయవంతమైన వ్యక్తి అని చాణక్యుడు చెప్పాడు.
చాణక్య ప్రకారం.. డబ్బును పొదుపు చేయడం, తెలివిగా ఖర్చు చేయడం మంచి అలవాటు. అయితే కొన్ని ప్రదేశాలలో డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడు వెనుకాడకూడదు. చాణక్య నీతి ప్రకారం.. అటువంటి పరిస్థితిలో లేదా ప్రదేశాల్లో డబ్బు ఖర్చు చేయడం వల్ల రెట్టింపు సంపాదనకు అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి : Chanakya Niti : విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన ఈ 4 మార్గాలు అనుసరించండి..!