మనం చేసే చిన్న పొరపాట్ల వలన ఆరోగ్యం పడుతుంది ఈ ఆహార పదార్థాలని కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే గర్భసంచి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకునే మహిళల్లో ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కేకులు, వేఫర్స్, ఐస్ క్రీములు, ఫ్రై చేసిన ఆహార పదార్థాలలో ఇవి ఎక్కువ ఉంటాయి. గ్లూటెన్ ఫుడ్ వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఐస్ క్రీమ్, పాస్తా, పిజ్జా, గోధుమలు ఇటువంటివి తీసుకుంటే కూడా ఆడవాళ్ళల్లో ఈ సమస్య ఉంటుంది.
Advertisement
Advertisement
సంతానోత్పత్తి వయసులో ఉన్న స్త్రీలు అసలు ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. ఇది శరీరంలో ఈస్ట్రోజన్ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది ఆల్కహాల్ ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తీసుకుంటే సంతనోత్పత్తి పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలానే కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవడం వలన ఇంప్లాంటేషన్ ప్రక్రియ చెదిరిపోతుంది దీంతో పిండం అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. సో గర్భిణిలు అసలు కెఫీన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!