యువతుల వివాహ వయసు పై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదివరకు మహిళల వివాహ వయస్సు 18 ఏళ్లు ఉండగా కేబినెట్ 21 ఏళ్ల కు పెంచుతూ ఆమోదం తెలిపింది. ఇక ఇక తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై యువతులు పెళ్లి చేసుకోవాలంటే కనీస వయస్సు 21 వీళ్ళు ఉండాల్సిందే. యువకులకు కూడా కనీస వయసు 21 ఏళ్లు ఉండగా ఇప్పుడు ఇద్దరికీ సమాన వయసు వచ్చిన తర్వాతే వివాహం చేసుకునేలా తాజా నిర్ణయం ఉంది. ఇదిలా ఉంటే స్వాతంత్రానికి ముందు భారత్ లో వివాహ వయస్సు పై ఎటువంటి ఆంక్షలు ఉండేవి కావు. దాంతో చిన్నవయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేవారు.
ఇష్టం ఉన్నా లేకపోయినా చిన్న వయసులో వివాహం చేయడం వల్ల పెళ్లి తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొనే వారు. తెలిసి తెలియని వయసులోనే పిల్లలను కనడం కుటుంబాన్ని చూసుకోవడం లాంటి బాధ్యతలు మహిళలకు భారంగా మారేవి. ఆరోగ్య పరంగా ఆర్థికంగా అన్ని బలహీనంగా ఉండేవారు. అయితే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మహిళ వివాహ వయస్సు పై మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన సమయంలో మహిళల వివాహ వయస్సు 18 ఏళ్లుగా పురుషుల వివాహ వయసు 21 ఏళ్లుగా నిర్ధారించారు. అయితే నాగరికత… సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా జీవితంలో స్థిర పడిన తర్వాతే తాము కూడా వివాహం చేసుకోవాలని మహిళలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కి పలువురు యువతులు లేఖలు రాసినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
వివాహ వయస్సు పెంచాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మహిళలను రిక్వెస్ట్ లు వచ్చిన నేపథ్యంలోనే కేంద్రం వారి వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంతో మహిళలకు ఎంతో మేలు జరగనుంది. జీవితంలో తాము స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకునే అవకాశం కలగనుంది. అంతేకాకుండా చదువు మధ్యలో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలి అని ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంది. దాంతో తమ చదువులు పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడతారు. ఆ తరవాతే తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకుని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళా సాధికారత… మహిళలకు గౌరవం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది.