ఈ లోకంలో భార్య, భర్తల బంధం ఎంతో గొప్పది. సృష్టిలో అన్నింటి కంటే గొప్ప బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యభర్తల బంధమే. అప్పటి వరకూ ఎలాంటి పరిచయం లేకపోయినా పెళ్లి తరవాత భార్య తన పుట్టింటిని వదిలిపెట్టి మెట్టినింట్లో అడుగుపెడుతుంది. భర్త కుటుంబమే తన కుటుంబం అనుకుంటుంది. అయితే… తాజాగా భార్యలు చేసే కొన్ని తప్పుల వల్ల భార్యభర్తల మధ్య కలహాలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?
Advertisement
భర్త ఇంట్లో లేని సమయంలో కొంతమంది భార్యలు ఫోన్ లో బిజీగా ఉండిపోతారు. అయితే ఫోన్ చూస్తే తప్పు లేదు కానీ ఇతరులతో చాటింగ్ చేయకూడదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయ అయ్యే అపరిచిత వ్యక్తులతో ఎలాంటి స్నేహ సంబంధాలు పెట్టుకూడదని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా భర్త లేని సమయంలో స్నేహితుడు అయినా సరే ఇతర పురుషులను ఇంటికి పిలవకూడదని మానిసిక నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
READ ALSO : హార్ట్ ఎటాక్ వస్తే… CPR ఎలా చేయాలి? ఇవే నియమాలు కచ్చితంగా తెలుసుకోండి.
అలా చేస్తే భర్తకు అనుమానం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక భర్త కష్టపడి ఇంటికి వస్తే భార్యలు సీరియల్స్ చూస్తూ ఇతరులతో టైమ్ పాస్ చేస్తూ సమయం గడపకుండా అతడికి ఇష్టమైన భోజనం వండిపెట్టడం అతడికి నచ్చిన విధంగా రెడీ అవ్వడం లాంటివి చేయాలని చెబుతున్నారు. అంతే కాకుండా భర్త పనిమీద భయటకు వెళ్లినప్పుడు అతడికి పదే పదే ఫోన్ లు చేసి ఇబ్బంది పెట్టకూడదని.. అవసరం ఉంటేనే ఫోన్ చేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
READ ALSO : Samantha : మళ్లీ అనారోగ్యం బారిన సమంత..ఆస్పత్రికి తరలింపు ?