మహిళలు సాధారణం గా సాష్టాంగ నమస్కారం చేయడం ఎప్పుడూ కనిపించదు. నిజానికి ఎక్కుడ కూడా స్త్రీ లు సాష్టాంగ నమస్కారం చేయరు. దీనికి బలమైన కారణం ఉంటుంది. అందుకనే మహిళలు సాష్టాంగ నమస్కారం చేయరు. పురుషులు మాత్రం ఎలాంటి సమస్యలు లేకుండా సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. సాధారణం గా మనం ఎక్కడా చూసినా.. పురుషులు మాత్రమే దేవాలయాల వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తారు. మహిళలు చేయాలని ఎవరూ కూడా ఆదేశించరు. అయితే చాలా మందికి ఈ సందేహం వస్తుంది. కేవలం పురుషుల మాత్రమే ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు? మహిళలు ఎందుకు చేయర అనే సందేహం చాలా మందికి వస్తుంది.
Advertisement
Advertisement
దీనికి హిందూ పురణాల ప్రకారం ఒక కారణం ఉంటుంది. అలాగే సైన్స్ ప్రకారం కూడా ఒక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు దానికి గల కారణాలను మనం తెలుసుకుందాం. మనం దేవాలయాలు కు వెళ్లినా.. పెద్ద పెద్ద పూజారుల వద్ద కు వెళ్లిన మహిళు సాష్టాంగ నమస్కారం చేయరు. కేవలం మోకాళ్లు, మో చేతులు మాత్రమే భూమి కి తాకించి.. పంచాంగ నమస్కారం మాత్రమే చేస్తారు. దీనికి గల కారణం.. మహిళలు సాష్టాంగ నమస్కారం చేస్తే వారి వక్ష స్థలం తో పాటు ఉదర భాగం , కాళ్లు చేతులు భూమికి తాకుతాయి.
అయితే మహిళ లకు ఉదర భాగం లో గర్భాశయం ఉంటుంది. దీంతో స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల ఉదరం పై ఒత్తిడి పెరుగుతుంది. అంటే.. గర్భాశయం మీద కూడా ఒత్తిడి కలుగుతుంది. దీంతో మహిళలో ఉండే గర్భ స్రావాలకు సంబంధించి సమస్యలు ఏర్పాడుతాయి. అందు కోసమే మహిళలు ఎప్పుడూ కూడా సాష్టాంగ నమస్కారం చేయరు. అలాగే వారి ని చేయమని కూడా ఎవరూ చెప్పరు.