మనలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి ఆదాయం కావాలని, జీవితం సంతోషంగా, సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుందని మనలో చాలామంది నమ్ముతారు. అందుకే అందరూ లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కానీ కొందరు తెలిసీ తెలియక చేసే తప్పుల వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఏది ఏమైనాప్పటికీ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. తప్పులను నివారించడంలో ఇంటి ఇల్లాలు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.
Advertisement
ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరుతుందని పురాణ శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. మన అమ్మమ్మలు, తాతమ్మల కాలంలో స్త్రీలు ఉదయం 3 గంటలకల్లా నిద్రలేచి స్నానం చేసిన తర్వాతే ఏ కార్యక్రమాన్ని అయినా ప్రారంభించేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది కొందరు మహిళలు ఇంటి పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఉదయం వేళ స్నానం చేయకుండానే అనేక పనులు చక్కబెట్టేస్తుంటారు. అయితే కొన్ని రకాల పనులను స్నానం చేయకముందే చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరీ స్త్రీలు స్నానం చేయకుండా ఆచరించకూడని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
#1. తులసిని తాకొద్దు:
మన హిందూ ధర్మాలలో తులసీ మొక్కను లక్ష్మీ దేవికి ప్రతిరూపం భావిస్తారు. ఇంట్లోని తులసి పెంచడం, పూజించడం ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారు. రోజూ ఉదయం పూజ చేసిన అనంతరం తులసి మొక్కకు నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్ర పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇంటి ఇల్లాలు ఎంత పని ఉన్నా కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తులసి మొక్కకు నీళ్లు పోయాలి. ఇక సాయంత్రం వేళ నీళ్లు పోసే ముందు కూడా శుభ్రంగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్న అనంతరం తులసి మొక్కకు నీళ్లు పోయాలి. స్నానం చేయకుండా తులసికి నీళ్లు పోయడం, తులసి ఆకులను తాకడం స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు.
#2. వంటగదిలోకి వెళ్లడం:
Advertisement
ప్రస్తుత కాలంలో అందరూ హడావిడి జీవితాలు కాబట్టి ఈ రోజుల్లో స్త్రీలు స్నానం చేయకుండానే వంటగదిలోకి వెళ్లడం, అల్పాహారం చేయడం లాంటివి చేస్తున్నారు. ఉదయం వేళ నిద్రలేచి స్నానం చేశాకే వంటగదిలోకి వెళ్లి వంట చేయాలంటే శ్రమతో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలా మంది స్నానం చేయకుండానే వంట గదిలోకి వెళ్లి అన్ని పనులు మొదలు పెట్టేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మన పూర్వీకుల దగ్గర నుంచి వంటగదిలోని పొయ్యిని లక్ష్మీ దేవిగా భావిస్తారు. స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించడం వల్ల లక్ష్మీ ఆగ్రహానికి గురై ఆ ఇంటిలోని వారు అనారోగ్యం బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని పండితులు వెల్లడిస్తున్నారు.
#3. జుట్టు దువ్వడం:
తలస్నానం చేసే ముందు మనలో చాలామందికి జుట్టు దువ్వుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం వెల్లడిస్తుంది. ఇంట్లో జుట్టు విరబూసుకుని దువ్వుకోవడం వల్ల దారిద్ర్యం వెంటాడుతుందని, ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందువల్ల స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే జుట్టు దువ్వుకోవాలని మన పెద్దవారు కూడా చెబుతూనే ఉంటారు.
#4. డబ్బు ముట్టుకోవద్దు:
ప్రతి మనిషి జీవనానికి అవసరమయ్యే డబ్బును మనం లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి.. డబ్బు కింద పడ్డా, కాళ్లు తగిలినా కళ్ళకు హత్తుకుని నమస్కారం చేసి భద్రపరచుకుంటాము. లక్ష్మీ దేవికి ప్రతిరూపమైన డబ్బును ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకముందు ముట్టుకోవద్దని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. లక్ష్మీదేవి ఆగ్రహం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడి అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. అందుకే స్త్రీలు ఉదయం వేళ నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే ఏ పనులైనా ప్రారంభించాలని పెద్దలు చెబుతుంటారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చనిపోయిన పెద్దలు పితృ దేవతలు కాదు.. మరి పితృ దేవతలు అంటే ఎవరు..?
శుక్రవారం నాడు మాత్రం అస్సలు ఈ పొరపాట్లని చెయ్యకండి.. డబ్బులన్నీ పోతాయి..!
ఆదాయం పెరగాలంటే చేయవలసిన పనులు…ఇలా చేస్తే చాలు…!