Home » 2050లో భార‌త్‌లో ట‌మోటా క‌నుమ‌రుగవుతుందా..?

2050లో భార‌త్‌లో ట‌మోటా క‌నుమ‌రుగవుతుందా..?

by Bunty
Ad

వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా టమాటా సాగులో వస్తున్న మార్పులు ఏమిటి? ఈ మార్పులతో భారత్ సహా పలు దేశాల్లో ప్రస్తుతం మనం చూస్తున్న రకం టమాటాలు త్వ‌ర‌ల కనుమరుగు కానున్నాయా..? శాస్త్రవేత్త‌లు చేసిన పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గుబురుగా ఉండే ఈ మొక్క ఆకులు, చిన్నని ఎర్రటి పండ్లు పెరూ, ఈక్వెడార్‌లలో పెరిగే సొలానమ్ పింపైనెలిఫోలియమ్ (రెడ్ కరెంట్ టమాటా) అనే ఒక అడవి జాతి టమాటాలో కనిపిస్తాయి. కాస్త దగ్గరగా పరిశీలిస్తే ఈ మొక్క విశిష్టత మరింత స్పష్టంగా కనిపించింది. అడవి టమాటాతో పోలిస్తే ఈ మొక్క మరింత చిన్నది. కొమ్మలు కూడా తక్కువ. కానీ పండ్లు ఎక్కువగా ఉన్నాయి. దీని పండ్లు కూడా మరింత ముదురు రంగులో ఉన్నాయి. అంటే క్యాన్స‌ర్, హృద్రోగాల ముప్పును తగ్గిస్తుందని భావించే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఇందులో ఎక్కువగా ఉన్నట్లు ఈ ముదురు రంగు చెబుతుంది.

 

Advertisement

నిజానికి జెనిటిసిస్ట్ టోమస్ సెర్మాక్, ఆయన సహోద్యోగులు క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ మొక్కను సృష్టించారు ఈ టెక్నిక్ ఇప్పుడు వ్యవసాయాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తోంది. భవిష్యత్ పంటలను రూపొందించటానికి ఇది ఎంత‌గానో దోహదపడుతుంది. సులభంగా సాగు చేయగలిగే, పోషకాలతో నిండిన, రుచికరమైన టొమాటో మొక్కను.. అది కూడా వాతావరణ మార్పును మరింతగా తట్టుకోగలిగే మొక్కను తయారు చేయాలని సెర్మాక్ నడుంకట్టారు. ఇలా అన్ని రకాలా ఒత్తిళ్లకు, వేడి, చలి, ఉప్పు, కరవులతో పాటు అన్ని రకాల చీడపీడలనూ తట్టుకోగలిగే మొక్క కావాలి అని అంటున్నారు టోమ‌స్ సెర్మాక్‌. క్రిస్పర్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని మొక్కలను భవిష్యత్ వాతావరణాలను తట్టుకునేలా రూపొందించే పరిశోధనలకు టమాటా సరిగ్గా సరిపోతుంది. క్రిస్పర్ అనేది ఓ మాలిక్యుల‌ర్ టూల్ బాక్స్ అని.. దీనిని శాస్త్రవేత్త‌లు బాక్టీరియా నుంచి రూపొందించారు.

Advertisement

 

2013 నుంచి క్రిస్పర్ టెక్నాలజీని మొక్కల్లో ఉపయోగిస్తున్నారు. దీనిద్వారా.. మొక్కల్లో తాము కోరుకునే లక్షణాలను రాబట్టుకోవటానికి వాటి జన్యుపటాన్ని అత్యంత కచ్చితంగా మార్చటానికి పరిశోధకులకు వీలు ఉంటుంది. జన్యువులను చొప్పించటం, తొలగించటం, లక్షిత మ్యుటేషన్లు సృష్టించటం చేయవచ్చు. జంతువుల్లో కూడా క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మార్చాల్సిన సరైన జన్యువును కనుగొనటం ఈ పరిశోధనలో మొదటి మెట్టు. వాతావరణ ఒత్తిళ్లను తట్టుకోవటానికి సంబంధించిన జన్యువులను గుర్తించాల్సి ఉంటుందని నెదర్లాండ్స్‌లోని వాగెనింన్జెన్ యూనివర్సిటీలో ప్లాంట్ జెనెటిసిస్ట్ రిచర్డ్ విస్సర్ పేర్కొంటున్నారు. టమాటాలు సహా మొక్కలను సాగు చేయటం వల్ల.. వాటి జన్యు వైవిధ్యం భారీగా నష్టపోయింది. ఆధునిక వాణిజ్య పంటలు వేగంగా పెరుగుతాయి, దిగుబడులు సులభంగా వస్తాయి. కానీ జన్యుపరంగా చూస్తే.. అవి మొత్తం ఒకే రకంగా ఉంటాయి. ప్రపంచ వ్యవసాయం మొత్తంలో.. సోయాబీన్, వరి, గోధుమ, మొక్కజొన్న, ఈ నాలుగు ఏకజాతి పంటలే అధికంగా ఉన్నాయి. ప్రపంచ వ్యవసాయ భూమిలో సగం పైగా ప్రాంతాన్ని ఈ నాలుగు పంటలే ఆక్రమించుకున్నాయి. అయితే క్రిస్పర్ జన్యు సవరణ ఆహార ఉత్పత్తుల ఆమోదంపై ప్రస్తుత అధ్యయనాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అయితే చూడాలి మ‌రీ ట‌మోటా పై ఏమి జ‌రుగుతున్న‌ద‌నేది.

 

Visitors Are Also Reading