CM Jagan PubG: అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు బయటకి వస్తూ ఉంటాయి అలానే రాజకీయ నాయకులకి సంబంధించిన వీడియోలు వార్తలు కూడా బయటకి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే పాలిటిక్స్ బాగా హీట్ ఎక్కుతున్నాయి. వార్తాపత్రికలు టీవీ చానల్స్ ని చూసి ఏది నిజం, ఏది అబద్దం అనేది తెలుసుకోవడం కష్టంగా మారిపోతోంది. నిజాలు ఏంటో తెలుసుకోవడం కోసం టీవీ చానల్స్ ని చూడడం జనం ఎప్పుడో మానేశారు ముఖ్యంగా పొలిటికల్ న్యూస్ లో కూడా ఏది నిజం అనేది తెలియట్లేదు. నిజం గా చెప్పే పత్రికలు టీవీ చానల్స్ పోయాయి. ఆయా పార్టీలతో కలిసిపోయి ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు.
ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీపై మరొక పార్టీ పోటీగా సినిమాలని రిలీజ్ చేస్తున్నాయి. వివాదాలను సృష్టించడంలో ముందు వుండే రాంగోపాల్ వర్మ ఇటీవల వైసిపి పార్టీకి అనుకూలంగా శపధం, వ్యూహం సినిమాలని రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాజధాని ఫైల్ సినిమాని రిలీజ్ చేసింది. రాజధాని ఫైల్స్ లో సీఎం జగన్ ని విలన్ గా చూపించారు ఈ సినిమాలో అనేక సీన్లు సీఎం జగన్ పర్సనల్ లైఫ్ ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి సీఎం జగన్ నిరంతరం పబ్జి గేమ్ ఆడుతూ ఉంటారని టీవీలో పగలగొడతారని చూపించారు.
Advertisement
Advertisement
నిజానికి లోకేష్ బాబు తో పాటు జనసేన కూడా సీఎం జగన్ ని పబ్జి ముఖ్యమంత్రి అని విమర్శలు చేశారు. సీఎం జగన్ కి పబ్జి ఆడే అలవాటు ఉందా అనేది చూస్తే ఇవన్నీ చౌకబారు చిల్లర కామెంట్లను ఖండిస్తూ జగన్ లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికరమైన విషయాలని చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదంతా కూడా చిల్లర వ్యవహారం శివకుమార్ వ్యాఖ్యలు ఇలాంటి పనికిమాలిన విమర్శలను బట్టి లోకేష్ స్థాయి ఏంటో తెలుస్తోంది. ఇంతకంటే నీచమైన చిల్లర విమర్శలు ఉండవని సజ్జల అన్నారు. ఏదైనా సీన్లు క్రియేట్ చేయడం, డైవెర్షన్ పాలిటిక్స్ వాటిపై హైప్ రావడం లాంటి దౌర్భాగ్యపు పాలిటిక్స్ జగన్ గారి స్ట్రెంత్ కాదని అన్నారు. ఆయన్ని దగ్గర నుంచి చూసిన వాళ్లు ఎవరికైనా తెలుసు. ఆయన ఎలా మాట్లాడతారు ఎలా ఉంటారని అని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!