Home » అనుష్క బర్త్ డే గిప్ట్.. ఈ హిట్ మూవీ పార్ట్ 2 ని ప్రకటించనున్నారా ?

అనుష్క బర్త్ డే గిప్ట్.. ఈ హిట్ మూవీ పార్ట్ 2 ని ప్రకటించనున్నారా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనుష్క అరుంధతి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాహుబలి మూవీతో అయిదతే దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది అనుష్క . హీరోకు ఏ మాత్రం తక్కువ కాకుండా నటిస్తోంది అనుష్క.

Advertisement

సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ అంటే రెండు సీన్లు, మూడు పాటలకు మాత్రమే పరిమితం అవుతుంటుంది. కానీ అనుష్క మాత్రం అలా కాదు.. అవసరం అయితే తనే ఒక సినిమాని ఒటిచేత్తో నడిపించగలదు. ఈ విషయాన్ని పలు మార్లు నటి అనుష్క నిరూపించింది. అందుకే ఆమెకు ఇక్కడ అంత క్రేజ్ ఏర్పడింది. సినీ కెరీర్ ప్రారంభంలో అందాలు ఆరబోసినా.. ఆ తరువాత అరుంధతిలో జేజమ్మగా నటనతో ఆకట్టుకుంది. ఆ తరువాత బాహుబలిలో  దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించింది. కథానాయిక ప్రాధాన్యత ఉన్న మూవీ అనగానే ఫస్ట్ ఛాయిస్ ప్రస్తుతం అనుష్క పేరు గుర్తుకు వచ్చేవిధంగా చేసుకుంది. వేద మూవీలో సరోజ పాత్రలో తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగించింది. బిల్లాలో గ్లామర్ తో కిక్ ఇచ్చింది.

Advertisement

తాజాగా విడుదలైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీలో అన్విత పాత్రలో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అనుష్క సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా భాగమతి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్టు సమాచారం. ఇవాళ నవంబర్ 07న అనుష్క పుట్టిన రోజు సందర్భంగా భాగమతి 2 చిత్రం గురించి యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా ప్రకటన అధికారికంగా కనుక వస్తే తన కెరీర్ లో 50వ చిత్రంగా రికార్డుకెక్కనుంది. బర్త్ డే సందర్భంగా భాగమతి 2 వస్తుందో రాదో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.  

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి.     తెలుగు న్యూస్ కోసం వీటిని వీక్షించండి.

Visitors Are Also Reading